చంద్రబాబు ఎఫెక్ట్: ఉత్సాహం కోసం తన వైఖరికి భిన్నంగా జగన్, వారికి ఎర
ఓ వైపు అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికలను కొట్టి పారేస్తుంటే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు మాత్రం ఎన్నికలు ముందు వచ్చినా సిద్ధమేనని చెబుతున్నాయి.
అమరావతి: ఓ వైపు అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికలను కొట్టి పారేస్తుంటే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు మాత్రం ఎన్నికలు ముందు వచ్చినా సిద్ధమేనని చెబుతున్నాయి. అందరికంటే ఎక్కువగా వైసిపి అధినేత జగన్ ఎన్నికలను కోరుకుంటున్నారని చెప్పవచ్చు.
చదవండి: చంద్రబాబుపై అలిగి.. చివరకు జగన్‌కు షాకిచ్చారు!
2014లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఎన్నికల కలలు కంటున్నారు. ఒకటి రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని, దేవుడు దయ తలిస్తే ప్రభుత్వం కూలుతుందని, అప్పుడు ముందుగానే ఎన్నికలు వచ్చి తాను అధికారంలోకి వస్తానని జగన్ చెబుతుండేవారు.
చదవండి: లగడపాటి మాటలతో కంగుతిన్న చంద్రబాబు
కానీ ఆయన ఆశలు మాత్రం నెరవేరలేదు. గతంలో ఓసారి రాజ్ భవన్ ఎదుట.. తన వైపు అధికార పార్టీ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రభుత్వం కూలుతుందని జగన్ ప్రకటించారు. ఆ తర్వాత మాత్రం వైసిపి నుంచే 21 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు.

నిన్నటి దాకా జగన్.. ఇప్పుడు చంద్రబాబు
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీశాయి. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఏపీ, తెలంగాణ టిడిపి నేతలకు సూచించారు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వస్తుందా అనే చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు జగన్ ముందుగానే ఎన్నికలు రావాలని కోరుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ముందస్తు గురించి మాట్లాడారు.

లోకేష్ తర్వాత వెంకయ్య కూడా నో
చంద్రబాబు ముందస్తు మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆ తర్వాత అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ముందస్తు అనలేదని, ఎన్నికలు ముందుగా వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పారని వివరణ ఇచ్చారు.
కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య కూడా ఆదివారం నాడు ముందస్తు ఎన్నికలను కొట్టి పారేశారు. దానికి అవకాశం లేదని తేల్చి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ముందుగా ఎన్నికలు రావని చెప్పారు.

సిద్ధమవుతున్న జగన్
ముందస్తును కొట్టి పారేస్తున్నప్పటికీ.. నిన్నటి దాకా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కోరుకున్న జగన్ ఇప్పుడు ముందస్తు వచ్చినా సిద్ధంగా ఉండాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆయన అన్ని రకాలుగా పావులు కదుపుతున్నారు.

పార్టీ లేని పవన్ కళ్యాణే సిద్ధమన్నారు.
ముందస్తు ఎన్నికల ప్రచారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొద్ది రోజుల క్రితం స్పందించారు. ముందస్తు వచ్చినా సిద్ధమని ప్రకటించారు. ఏమాత్రం క్యాడర్ జనసేన సిద్ధమని ప్రకటించింది. మరోవైపు, సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశించారు. దీంతో జగన్ కూడా అప్రమత్తమయ్యారని అంటున్నారు. ముందస్తు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీపై దృష్టి సారించారని అంటున్నారు.

పార్టీలో ఉత్తేజం తీసుకు వచ్చేందుకు..
జగన్ మే 1, 2 తేదీల్లో రెండు రోజుల పాటు రైతు దీక్ష చేశారు. దీక్షలు చేయడం జగన్‌కు అలవాటు అని టిడిపి నేతలు విమర్శిస్తుంటారు. కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ దీక్ష చేశారు. నిన్నటి వరకు అసెంబ్లీలో, పార్టీ పరంగా మాత్రమే టిడిపిని టార్గెట్ చేశారు. అప్పుడప్పుడు జనాల్లోకి వెళ్లినా.. దీక్షల ద్వారా పార్టీని ఉత్తేజపరచాలని జగన్ భావిస్తున్నారు. ఇదంతా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండే వ్యూహంలో భాగమే అంటున్నారు.

వ్యూహాలకు పదును
ఎన్నికలు 2019లో వచ్చినా లేదా చంద్రబాబు చెప్పినట్లు ముందస్తు వచ్చినా సిద్ధంగా ఉండాలని జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా తనకు అందుబాటులో ఉన్న అన్నింటిని ఉపయోగించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

పొలిటికల్ అడుగులు.. తన వైఖరికి భిన్నంగా వెళ్తున్నారా?
జగన్ రాజకీయంగా కూడా తన వైఖరికి భిన్నంగా వెళ్లే అవకాశాలు లేకపోలేదంటున్నారు. పార్టీలో జగన్ ఎవరి మాటా వినడని, ఆయన మాటే వేదం అని, మరొకరి జోక్యాన్ని సహించడనే విమర్శలు ఉన్నాయి. ఒంటెత్తు పోకడలు ఉంటాయని కూడా విమర్శిస్తుంటారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ఉన్న జగన్ తన వైఖరికి భిన్నంగా ముందుకు వెళ్లే ఆలోచనలు కూడా చేస్తున్నారని, లేదా చేయవచ్చునని అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా కలుస్తానని జగన్ చెప్పారు.
ఇప్పటికి టిడిపి - బిజెపిలకు జనసేన దూరమైంది. అధికారం కోసం లెఫ్ట్ పార్టీకి... తద్వారా పవన్ కళ్యాణ్‌కు దగ్గరయ్యే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. టిడిపి.. బీజేపీతో ఉన్నంత కాలం లెఫ్ట్ పార్టీలు చంద్రబాబును దగ్గరకు రానివ్వరు.

బీజేపీకి కూడా..
జగన్ బీజేపీకి కూడా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేసారనే ప్రచారం సాగింది. టిడిపిని దూరం చేసి, తాను బీజేపీకి దగ్గరవుదామని ఆయన చూస్తున్నారని టిడిపి నేతలు పలుమార్లు ఆరోపణలు చేశారు. కేసుల నుంచి బయటపడటంతో పాటు రాజకీయంగా తనకు లబ్ధి చేకూరుతుందనుకుంటే బీజేపీకి కూడా దగ్గరయ్యే ఆలోచనను జగన్ చేశారని అంటున్నారు.

చంద్రబాబుకు కౌంటర్‌గా..
2014లో వైసిపి నుంచి గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా జగన్ మాత్రం టిడిపిలోని అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. కొత్త వారి చేరికతో ఆయా అలక వహించే ఆ నియోజకవర్గ ఇంచార్జులు, ఇతర సీనియర్ నేతలకు వైసిపి ఎర వేస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications