ప్రధాని మోడీ ఆదేశాలతోనే టీడీపీపై బీజేపీ ఆరోపణ: పరిటాల సునీత
అమరావతి: ఎన్డీయే నుంచి తమ పార్టీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నేతలకు రాష్ట్రంలో అవినీతి కనిపిస్తోందా అని మంత్రి పరిటాల సునీత బుధవారం ప్రశ్నించారు.
చదవండి: 'మోడీ ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు, మాట్లాడవచ్చు కదా, బీజేపీకి అనుకూలంగా'
ఏపీ అసెంబ్లీ టీడీపీ, బీజేపీ నేతల మధ్య వాగ్యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడారు.

పట్టిసీమ అద్భుతంగా ఉందని గతంలో విష్ణు కుమార్ రాజు చెప్పారని, ఇప్పుడు ఈ విధంగా ఎలా మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతోనే బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నామన్నారు. పట్టిసీమ వల్ల ఇప్పుడు రాయలసీమకు సాగు, తాగు నీళ్లు అందుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications