జగన్ సర్కార్ కు హిందుస్తాన్ యూనీలీవర్ మరో గుడ్ న్యూస్..!
ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాల మహిళలకు సాధికారత కల్పించేందుకు వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా వైఎస్సార్ చేయూత పథకం అమలు చేస్తోంది. మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించి, వారి ఆర్థిక స్వాతంత్రాన్ని, స్వయం సమృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 45-60 ఏళ్ల వయస్సున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో 75 వేలు ఇస్తున్నారు. దీనికి హిందుస్తాన్ యూనీలీవర్ సంస్ధ సహకారం అందిస్తోంది.
ఇప్పుడు హిందుస్తాన్ యూనీలీవర్ ఏపీ సర్కార్ కు మరో విషయంలో సహకరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 12న నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, సహకారం, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితో హెచ్‌యుఎల్ ప్రతినిధులు, వ్యవసాయరంగంలో రాష్ట్రంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం ఇకపై పామాయిల్ ఉత్పత్తి విషయంలో ఇరువురూ కలిసి పనిచేస్తారు. ఇరువురూ పామ్ ప్లాంటేషన్, ఆయిల్ మిల్లుల ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 ఉద్యోగాలు లభిస్తాయి.

ప్రస్తుతం భారత దేశం బిస్కెట్ల నుంచి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో వాడకం కోసం పామాయిల్ ను భారీగా దిగుమతి చేసుకుంటోంది. అలాగే ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ దిగుమతి చేసుకునే దేశంగా కూడా ఉంది. దీంతో పామాయిల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు హిందుస్తాన్ యూనీలీవర్ భాగస్వామ్యంతో పామాయిల్ ఉత్పత్తి రంగంలో వేగంగా అభివృద్ధి సాధించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.
Thank you, @HUL_News, for your collaboration on the #YSRCheyutha Scheme. This partnership marks a significant milestone in our mission to empower women in rural Andhra Pradesh. Together, we are committed to creating a transformative impact by providing them with the resources and… https://t.co/y7VpdJh5g3
— YSR Congress Party (@YSRCParty) February 15, 2024
ఈ నేపథ్యంలో హెచ్యూఎల్ సంస్ధకు వైసీపీ ధన్యవాదాలు తెలిపింది. గతంలో గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించేందుకు వైఎస్సార్ చేయూత పథకంలో భాగస్వాములయ్యారని, ఇప్పుడు మరోసారి స్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి, వారికి అవసరమైన వనరులు, మద్దతును అందించడం ద్వారా పరివర్తనాత్మక ప్రభావాన్ని సృష్టించేందుకు కట్టుబడి ఉన్నట్లు వైసీపీ ఎక్స్ లో చేసిన పోస్టులో తెలిపింది. ఈ ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఎన్నో ఫలితాలను సాధించేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications