హైదరాబాద్ తర్వాత.. అనంతపురంని టార్గెట్ చేసిన ఐసిస్, లాడ్జీలో..

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని తర్వాత ఐసిస్ ఉగ్రవాదులు ఏపీలోని అనంతపురంను కూడా టార్గెట్ చేసారు. అనంత పట్టణంలో జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహించారు.

Also Read: హైదరాబాద్‌పై ఐసిస్ చీఫ్ కన్ను: ఎవరెవరికి ఏయే బాధ్యతలు?

నగరంలోని ఓ లాడ్జీలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాదులో పట్టుబడిన పలువురు ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

After Hyderabad, ISIS targets Anantapur also

కాగా, బస్టాండు సమీపంలో సోదాలు నిర్వహించిన లాడ్జీ నుంచి ఉగ్రవాదుల ఐడీ ప్రూఫ్స్, లాగ్ ఇన్ రిజిస్టర్, మరికొన్ని డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తుపాకీ కొనుగోలు చేసేందుకు ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After Hyderabad, ISIS targets Anantapur also.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి