రోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తికి కటింగ్ చేసిన మంచు మనోజ్.. వైరల్ వీడియో..!
టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తనదైన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు. చిన్నతనం నుంచే నటపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో బాలనటుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'దొంగ దొంగది' సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల భైరవం సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భైరవం సినిమాలో మంచు మనోజ్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మిరాయ్ సినిమాలో విలన్ పాత్రలో నటించి తనదైన నటనతో మెప్పించారు. ఇప్పుడు డేవిడ్ రెడ్డి అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు.

ఇటీవల మే 20 మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా డేవిడ్ రెడ్డి నుంచి వచ్చిన టీజర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు మంచు మనోజ్. ఈ సినిమా 1897 నుంచి 1922 మధ్య కాలంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే..? మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మతిస్థిమితం లేని ఓ మానసిక వికలాంగుడికి మనోజ్ స్వయంగా హెయిర్ కట్ చేశారు. అంతేకాక ఆ అనాథాశ్రమానికి అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Manchu Manoj Emotional Service 😍 | Helping Orphans on Roadside Viral Video#ManchuManoj #TeluguNews #ViralVideo #Humanity #HelpingHands #SocialService #HeartTouching #InspiringStory #GoodDeeds #Orphans #TeluguCinema #BRKNews pic.twitter.com/W9vzabUkzb
— BRKNews (@BRKTelugu_1) May 26, 2026
తన బర్త్ డే సందర్భంగా ఇటీవల మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ లో ఉన్న మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమానికి కావాల్సిన టేబుల్స్, కుర్చీలను విరాళంగా అందజేశారు. అంతేకాక అక్కడున్న వారందరికీ కొత్త దుస్తులను కూడా పంపిణీ చేసి గొప్ప మనసు చాటుకున్నారు. అలాగే తన బర్త్ డే సందర్భంగా అయిదుగురు పిల్లలను మంచు మనోజ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అలా సినిమాల్లో విలక్షణమైన నటనతో మెప్పించడమే కాకుండా నిజ జీవితంలోనూ మంచి మనసుతో రియల్ హీరోగా నిలుస్తున్నారు మంచు మనోజ్.












Click it and Unblock the Notifications