ఈ ఫోటోల మధ్య ఉన్న రెండు తేడాలను కనిపెట్టగలరా ?
ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో ఆప్టికల్ ఇల్యూషన్స్ (Optical Illusions) నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి కేవలం సరదా కోసం మాత్రమే కాదు.. మన మెదడు ఎంత వేగంగా పనిచేస్తుందో, కళ్ల పరిశీలనా శక్తి ఎంత పదునుగా ఉందో పరీక్షించే ఆసక్తికరమైన ఛాలెంజ్‌లు కూడా. ముఖ్యంగా "స్పాట్ ది డిఫరెన్స్" తరహా పజిల్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. చూసేందుకు రెండు చిత్రాలు ఒకేలా కనిపించినా.. వాటి మధ్య దాగి ఉన్న చిన్న చిన్న మార్పులను గుర్తించడం అంత సులభం కాదు. ఈ తరహా సవాళ్లు మన ఏకాగ్రతను పెంచడంతో పాటు మెదడును చురుకుగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ కొన్ని నిమిషాలు ఇలాంటి పజిల్స్ ప్రయత్నించడం వల్ల పరిశీలనా నైపుణ్యం, విజువల్ మెమరీ, ఫోకస్ మెరుగుపడతాయి.
పది సెకన్ల ఛాలెంజ్
ఈరోజు మీ కోసం తీసుకొచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌ను తీసుకొచ్చాం. ఇందులో ఒక యువతి ఇంటి కిటికీ దగ్గర నిలబడి బయట సాయంత్రపు అందమైన దృశ్యాన్ని చూస్తోంది. మొదటి చూపులో రెండు చిత్రాలు అచ్చం కాపీలా కనిపిస్తాయి. కానీ నిజానికి వాటి మధ్య రెండు సూక్ష్మమైన తేడాలు దాగి ఉన్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ రెండు తేడాలను మీరు కేవలం 10 సెకన్లలో గుర్తించాలి. టైమర్ స్టార్ట్ అయిన తర్వాత మీ కళ్లను పూర్తి ఫోకస్‌లో పెట్టి పరిశీలించండి. చిన్న మార్పులే అయినా.. అవే ఈ ఛాలెంజ్‌లో విజయం నిర్ణయిస్తాయి.

ఎందుకు ఇలాంటి పజిల్స్ మంచివి?
ఆప్టికల్ ఇల్యూషన్స్ మన మెదడుకు ఒక చిన్న జిమ్‌లాంటివి. ఇవి మెదడులోని దృశ్య విశ్లేషణకు సంబంధించిన భాగాలను చురుకుగా పనిచేయిస్తాయి. ముఖ్యంగా ఫ్రంటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్ వంటి భాగాలు యాక్టివ్ అవుతాయి. వీటి వల్ల ఏకాగ్రత, పరిశీలనా శక్తి మెరుగవుతుంది. మెదడు స్పందన వేగం పెరుగడమే కాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది. చిన్న విషయాలను గమనించే అలవాటు పెరుగుతుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇలాంటి విజువల్ ఛాలెంజ్‌లను ఆసక్తిగా ప్రయత్నిస్తున్నారు.
నిపుణుల అంచనా ప్రకారం, ఈ చిత్రంలోని రెండు తేడాలను 10 సెకన్లలో గుర్తించగలిగింది కేవలం ఒక శాతం మంది మాత్రమే. చాలా మంది మొదటి ప్రయత్నంలో కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే చిత్రంలోని అందమైన నేపథ్యం, రంగులు మన దృష్టిని మరల్చేస్తాయి. కాబట్టి తొందరపడకుండా ఒక్కో భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కిటికీ, అమ్మాయి దుస్తులు, బయట కనిపించే దృశ్యం, వస్తువుల ఆకారాలు వంటి ప్రతి చిన్న అంశాన్ని గమనిస్తే తేడాలు కనిపించే అవకాశం ఉంటుంది.
మీరు ఛాలెంజ్ పూర్తి చేశారా?
పది సెకన్లలో రెండు తేడాలను గుర్తించి ఉంటే నిజంగా మీ పరిశీలనా శక్తి అద్భుతమని చెప్పాలి. మీరు ఒక డిటెక్టివ్‌లా చిన్న చిన్న వివరాలను కూడా వెంటనే పసిగట్టగలరు. ఒకవేళ గుర్తించలేకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి పజిల్స్‌ను తరచుగా ప్రయత్నిస్తే మీ ఫోకస్, విజువల్ స్కిల్స్ మరింత మెరుగవుతాయి. మరి ఇంకేం ఆలస్యం.. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ సభ్యులతో ఈ ఛాలెంజ్‌ను షేర్ చేసి, ఎవరి కళ్లే ఎక్కువ పదునుగా ఉన్నాయో తెలుసుకోండి!












Click it and Unblock the Notifications