రెండో పెళ్లి తర్వాత కూడా నాగచైతన్య లైఫ్‌లో "సమంత".. ఫోటో వైరల్ !!
అక్కినేని వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య.. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతూ ఈసారి 'తండేల్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం కార్తీక్ వర్మ దర్శకత్వంలో "వృషకర్మ" అనే సినిమా చేస్తున్నారు. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. చైతూ ఆ మూవీ షూటింగులో బిజీ బిజీగా గడిపేస్తూ.. మరో సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
అయితే టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే ఆరోజుల్లో సమంత, నాగచైతన్యనే గుర్తొచ్చేవారు. నాగ చైతన్య సరసన 'ఏ మాయ చేసావే' సినిమాలో నటించి సమంత ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం చిగురించి, చివరకు అది ప్రేమగా మారింది. దీంతో వీరు ఇద్దరూ పెద్దవారిని ఒప్పించి 2017లో ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన కొన్నేళ్లకు మనస్పర్థల కారణంగా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.

కాగా ఆ తర్వాత 2024 డిసెంబర్ 4న నటి శోభితా ధూళిపాళ్లను.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చైతన్య. ఇక రీసెంట్ గానే సమంత కూడా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఏడడుగులు వేసి కొత్త జీవితం జీవితం మొదలుపెట్టింది. 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఘనంగా పెళ్లి వేడుక జరిగింది. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న "మా ఇంటి బంగారం" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి Nandini Reddy దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల, ఆమె సోదరి కలిసి ఉన్న ఓ ఫోటో ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కానీ శోభిత సోదరి పేరు 'సమంత' కావడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు కూడా ఈ పోస్టుపై తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చైతన్య భార్య సోదరి పేరు.. మాజీ భార్య పేరు ఒకటే కావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'సమంత' పేరుకు నాగ చైతన్యకు తెలియని బాండింగ్ ఉందంటూ పోస్టును తెగ షేర్ చేస్తున్నారు.













Click it and Unblock the Notifications