పంటలు వేయొద్దు, జులై 10 తర్వాత భూసేకరణే: మంత్రి నారాయణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూసేకరణను జులై 10 వరకు చేపడుతామని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు వేసిన కేసులన్నీ కోర్టు కొట్టివేసిందని చెప్పారు.
ఆ రైతులంతా భూ సమీకరణ ప్యాకేజీకి ఇష్టపడితే భూములు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. లేనిపక్షంలో జులై 10 తర్వాత భూసేకరణ చట్టాన్ని వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు.
9.3 ఫారాలు ఇచ్చిన రైతులెవరూ కొత్తగా పంటలు వేయొద్దని కూడా రైతులకు ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ప్రభుత్వం మాట వినకుండా పంటలు వేస్తే ఆ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.

ఐటి శాఖపై సిఎం చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో ఐటి పరిశ్రమ స్థితిగతులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో ఐటిశాఖ మంత్రి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఏడాదిలో 25లక్షల మొక్కలు నాటుతాం
రాష్ట్రంలో నీరు-చెట్టు కార్యక్రమం కింద 25లక్షల మొక్కలను నాటేందుకు తమ శాఖ తరపున సంకల్పించినట్లు ఏపి మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. నిరుడు లక్షా7వేల జల సంరక్షణ కట్టడాలను నిర్మించామని, ఇందుకోసం రూ. 13.46కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఏ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 43వేల ఎకరాలలో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications