వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి 'ప్రత్యేక' షాకిచ్చేనా: కేజ్రీవాల్‌తో పవన్ కళ్యాణ్ కలుస్తారా

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దృష్టి దక్షిణాది పైన పడిందా? అంటే కావొచ్చొని అంటున్నారు. కమల్‌హాసన్‌తో భేటీయే అందుకు నిదర్శనం అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దృష్టి దక్షిణాది పైన పడిందా? అంటే కావొచ్చొని అంటున్నారు. కమల్‌హాసన్‌తో భేటీయే అందుకు నిదర్శనం అంటున్నారు.

ఢిల్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించాలని కేజ్రీవాల్ భావించారు. కానీ ఆ తర్వాత పరిణామాలు ఆయన ఢిల్లీకే పరిమితమయ్యేలా చేశాయి.

ఈగో వద్దు, బాగోతం బయటకు: చంద్రబాబు క్లాస్, తెలంగాణలో ఉంటున్నవాళ్లు కూడా..ఈగో వద్దు, బాగోతం బయటకు: చంద్రబాబు క్లాస్, తెలంగాణలో ఉంటున్నవాళ్లు కూడా..

ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో గెలవలేదు. కానీ బిజెపి - అకాలీదళ్ పార్టీల కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంది. ఈ ఊపులో కేజ్రీవాల్ తాజాగా దక్షిణాదిపై దృష్టి సారించారు.

బిజెపికి చెక్ చెప్పేందుకేనా?

బిజెపికి చెక్ చెప్పేందుకేనా?

బిజెపికి ఉత్తరాదిన మంచి బలం ఉంది. దక్షిణాదిలో అంత పట్టు లేదు. దీంతో ఇటీవల దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది కమలదళం. ఇదే సమయంలో కేజ్రీవాల్ దక్షిణాదిపై దృష్టి పెట్టడం గమనార్హం. ఉత్తరాదిన బిజెపిని, ఆ పార్టీ గెలుపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న కేజ్రీవాల్, ఇప్పుడిప్పుడే దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించిన బిజెపికి కౌంటర్‌గా తెరపైకి వచ్చి ఉండవచ్చునని అంటున్నారు.

నేతలను కలుస్తున్న కమల్ హాసన్

నేతలను కలుస్తున్న కమల్ హాసన్

కేజ్రీవాల్ గురువారం చెన్నైలోని కమల్ హాసన్ ఇంటికి వచ్చారు. కమల్ కూతురు అక్షర్ హాసన్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి కేజ్రీవాల్‌ను రిసీవ్ చేసుకున్నారు. తర్వాత కమల్ ఇంటికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరిగింది. రాజకీయాల్లోకి వచ్చే ముందు వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తానని చెప్పిన కమల్.. ఇంతకుముందే కేరళ సీఎం విజయన్‌ను కలిశారు.

ఏ పార్టీలో చేరడం లేదు

ఏ పార్టీలో చేరడం లేదు

డీఎంకే పత్రిక మురుసోలి 75వ వార్షికోత్సవ వేడుకలకు హాజరై స్టేజ్ మీద స్టాలిన్ పక్కన కూర్చున్నారు. అయితే ఒక్కో నేతను కమల్ హాసన్ కలిసినప్పుడల్లా అతను ఆయా పార్టీల్లో చేరతారని పుకార్లు వచ్చాయి. వాటన్నిటికీ ఈ మధ్యే ఫుల్‌స్టాప్ పెట్టారు.

పార్టీ పెడతానని కమల్ ప్రకటన

పార్టీ పెడతానని కమల్ ప్రకటన

తన విప్లవాత్మక భావజాలానికి తగిన పార్టీ ఏదీ లేదని, అందుకే తానే కొత్త పార్టీ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కమల్ హాసన్ చెప్పారు. తాజాగా, గురువారం కేజ్రీవాల్ వచ్చి కలిశారు. కేజ్రీవాల్ తన ఇంటికి రావడం సంతోషంగా ఉందని, అవినీతితోపాటు వివిధ అంశాలపై తాము చర్చించినట్లు కమల్ చెప్పారు.

బిజెపిని టార్గెట్ చేసినట్లే

బిజెపిని టార్గెట్ చేసినట్లే

అవినీతి, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడటంలో కేజ్రీకి మంచి పేరు ఉందని కమల్ హాసన్ చెప్పారు. తనకు అలాంటి పేరే ఉందని, అందుకే తాను కేజ్రీవాల్ కలిశామన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టే వారి టార్గెట్ బిజెపి అని అర్థమవుతోందని అంటున్నారు.

రజనీని, బిజెపిని అడ్డుకోవడానికేనని

రజనీని, బిజెపిని అడ్డుకోవడానికేనని

పైగా, పలువురు రజనీకాంత్‌ను బిజెపి అనుకూలురుగా భావిస్తారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే కమల్ హాసన్ పార్టీ పెడతానని ప్రకటించడం రజనీకాంత్‌కు తద్వారా బిజెపిని తమిళనాట అడ్డుకోవడానికేనని అంటున్నారు.

పవన్ కళ్యాణ్‌తో కలుస్తారా?

పవన్ కళ్యాణ్‌తో కలుస్తారా?

కమల్ హాసన్‌ను కేజ్రీవాల్ కలిసిన నేపథ్యంలో.. దక్షిణాదిపై దృష్టి సారించిన ఆప్ అధినేత తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారిస్తారా, పవన్ కళ్యాణ్‌తో కలుస్తారా అనే చర్చ కూడా సాగుతోంది.

పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారు

పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారు

2014లో టిడిపి-బిజెపికి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో బిజెపిపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో ఎవరితోనైనా కలిసి వెళ్తారా లేక ఒంటరిగా వెళ్తారా తెలియరాలేదు. భావసారుప్యం కలిగిన పార్టీలతో పవన్ వెళ్లినా వెళ్లవచ్చు. ఇక, బిజెపికి చెక్ చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా కేజ్రీవాల్.. పవన్‌తో కలిసినా కలవొచ్చని అంటున్నారు. ఇప్పటికే పవన్ లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal has met Actor Kamal Hassan on Thursday. Will kejriwal meet Jana Sena chief Pawan Kalyan to counter BJP in south india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X