8ఏళ్ల తర్వాత: చుక్క నీరు లేని చిత్రావతికి జలకళ..
చిత్రావతి నదికి భారీగా వరద నీరు పోటెత్తింది.
అనంతపురం: అనంతపురం జిల్లా అంతటా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు పెద్దపప్పూర్ మండలం చాగల్లు రిజర్వాయర్ కుడి కాల్వకు గండి పడింది.
ఇదే మండలంలోని వరదాయపల్లిలో ఇంటి పైకప్పు కూలి ఓ చిన్నారి మృతి చెందింది. మరోవైపు చిత్రావతి నదికి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో 8ఏళ్ల నుంచి చుక్క నీరు లేని చిత్రావతి ఇప్పుడు జలకళను సంతరించుకుంది.

అలాగే ముదిగుబ్బ మండంలోని యోగి వేమన ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో.. ప్రాజెక్టు 8గేట్లను ఎత్తేసి దిగువకు 40వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.












Click it and Unblock the Notifications