'జగన్! టిడిపి-బిజెపిపై అలాంటి ఆశలు వద్దు, నీ ప్రవర్తన వల్లే'
బిజెపి - టిడిపి కాపురం కూలిపోవాలని కొందరు చూస్తున్నారని, అది సాధ్యం కాదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు.
Recommended Video

ఏలూరు: బిజెపి - టిడిపి కాపురం కూలిపోవాలని కొందరు చూస్తున్నారని, అది సాధ్యం కాదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు.
బిజెపి, టిడిపి పార్టీల మధ్య విడాకులుండవని సోమిరెడ్డి స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగుతుందన్నారు. ఆయన మంత్రి, బిజెపి నేత మాణిక్యాల రావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. టిడిపితో కాపురం కూలిపోతే బిజెపితో జత కట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నంద్యాల ఎన్నికల సమయంలో వైసిపి నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.

వైసిపికి అలాంటి ఆశలు వద్దు
వైసిపి నేతలు అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దని సోమిరెడ్డి సూచించారు. లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి కోసం కృషి చేసిన టిడిపిని విశ్వసించి ప్రజలు నంద్యాలలో పట్టం కట్టారని చెప్పారు.

జగన్ ప్రవర్తన కారణంగానే
మూడేళ్లలో శాసనసభలో, బయటా జగన్ ప్రవర్తన, ఆయన వాడుతున్న భాష, ఆలోచన, వైఖరికి వ్యతిరేకంగా నంద్యాల ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. హద్దులు దాటి ప్రవర్తించినందుకు ప్రతిపక్షానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పారన్నారు. కాకినాడలోనూ టిడిపి-బిజెపి కూటమి అఖండ విజయం సాధిస్తుందని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జగన్ మాటలు నమ్మొద్దు
జగన్ మాటలు నమ్మవద్దని, అభివృద్ధి కోసం పాటుపడే టిడిపి వైపు నడవాలని మరో మంత్రి దేవినేని ఉమ అనంతపురంలో అన్నారు. ఓటు అనే ఆయుధంతో ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేసి ఏకపక్షంగా టిడిపికి మద్దతు పలకాలన్నారు.

2019లోను మనదే గెలుపు
సీఎం చంద్రబాబు ప్రజల కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్నారని, ఆయన చేసిన అభివృద్ధికి తార్కాణం నంద్యాలలో టిడిపి భారీమెజారిటీతో గెలుపొందడమేనని కాల్వ శ్రీనివాసులు అన్నారు. 2019లో కూడా ప్రలు ఏకపక్షంగా టిడిపికి ఓటేసి గెలిపిస్తారన్నారు.












Click it and Unblock the Notifications