వివేకా కేసులో లీకులకు సీబీఐ బ్రేక్-ఎదురుదాడికి వైసీపీ విరామం-అదే టర్నింగ్ పాయింట్
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే సీబీఐ సేకరించిన వాంగ్మూలాలను బట్టి చూస్తుంటే అన్ని వేళ్లూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చే వరకూ వెళ్లిన సీబీఐ.. ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయింది. అదే సమయంలో అప్పటివరకూ సీబీఐ లీకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురుదాడికి దిగిన వైసీపీ కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.

వివేకా కేసులో ట్విస్టులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు దాదాపు కొలిక్కివచ్చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సాక్షులతో పాటు నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించడం పూర్తి చేసిన సీబీఐ... కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో వైఎస్ అవినాష్ రెడ్డిని అనుమానితుడిగా పేర్కొంది. అప్పటినుంచి మొదలైన లీకులతో కొత్త ట్విస్టులు చోటు చేసుకోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా గతేడాది సీబీఐకి వివేకా కుటుంబసభ్యులతో పాటు వైఎస్ కుటుంబీకులు, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలన్నీ బయటికి వచ్చేశాయి. దీంతో వైసీపీ ఇరుకునపడింది.

సీబీఐ లీకులకు బ్రేకులు
వివేకా కేసులో తమకు నిందితులు, సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను సీబీఐ బయటపెడుతూ వచ్చింది. అధికారికంగా కాకపోయినా పరోక్షంగా వీటీని బయటపెట్టడంతో వార్తావత్రికల్లో పేజీలకు పేజీలు పలు కథనాలు కూడా వచ్చాయి. దీంతో వైసీపీకి మూలాధారమైన వైఎస్ కుటుంబం పాత్ర ఇందులో ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి. సీబీఐ దర్యాప్తు అంతా వైఎస్ కుటుంబం చుట్టే తిరుగుతూ ఉండటం, ఏ నిమిషంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ రేపింది. కానీ తాజాగా మళ్లీ సీబీఐ లీకులకు బ్రేక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

వైసీపీ ఎదురుదాడికీ బ్రేక్
వివేకా హత్య కేసులో ముందునుంచీ అనుమానాస్పదంగా వ్యవహరించిన వైఎస్ కుటుంబీలను సమర్ధించే క్రమంలో సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు సీబీఐపై ఎదురుదాడికి దిగారు. సీబీఐ ఉద్ధేశపూర్వకంగానే లీకులు ఇస్తోందని, దాన్ని ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని వరుసగా వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. కానీ తాజాగా సీబీఐ లీకులకు బ్రేక్ ఇవ్వడంతో ఆ మేరకు వైసీపీ నేతలు కూడా సీబీఐపై ఎదురుదాడికి విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. సీబీఐ దూకుడు ఆధారంగా వైసీపీ తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

టర్నింగ్ పాయింట్ అదే
వివేకా హత్య కేసులో సీబీఐ లీకులు మొదలుపెట్టడం, ఆ తర్వాత వైసీపీ ఎదురుదాడికి దిగడం ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ దూకుడు తగ్గించి ఎవరి పనిలో వారు నిమగ్నం కావడం వెనుక అసలు టర్నింగ్ పాయింట్ మాత్రం వేరేలా ఉంది. ఈ కేసులో తొలుత సీబీఐ దర్యాప్తుకు సహకరించినట్లు కనిపించిన వైసీపీ నేతలు, వైఎస్ కుటుంబీకులు.. ఆ తర్వాత మాత్రం ఎదురు తిరిగినట్లు తెలుస్తోంది. దీంతో సీబీఐ కూడా వైసీపీని ఇరుకునపెట్టేలా పరోక్షంగా లీకులు ఇవ్వడం మొదలుపెట్టినట్లు తెలిసింది. కానీ ఎప్పుడైతే ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుపుకోవడం, కోర్టులకు చేరడం, సీబీఐ వర్సెస్ ఏపీ పోలీసుగా మారడం మొదలైందో అప్పుడు విమర్శలకు తావివ్వరాదనే ఉద్దేశంతో సీబీఐ దూకుడు తగ్గించిందనే వాదన వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ కూడా ఇప్పుడు మౌనం వహిస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications