నిన్న పవన్ కళ్యాణ్ దెబ్బ: బాబుకు జగన్ ఊహించని షాక్ వెనుక అసలు ఉద్దేశ్యం!

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపించేకొద్ది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ, జనసేన పార్టీలు షాక్ మీద షాకిస్తున్నాయి! సోమవారం టీడీపీ తిరుపతి వేదికగా చేస్తున్న ధర్మ పోరాట దీక్ష సమయంలోనే జగన్.. చంద్రబాబు సహా ఎవరూ ఊహించని ప్రకటన చేసి, కలకలం రేపారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో సోమవారం జగన్ పాదయాత్ర కొనసాగింది.

Recommended Video

    సింగపూర్‌ను ఎలా నిర్మించాలో చెప్పిన పవన్

    నిమ్మకూరులో పాదయాత్ర సందర్భంగా ఊహించని ప్రకటన చేశారు. నిమ్మకూరులో నీరు-చెట్టు కింద తవ్విన చెరువును జగన్‌ పరిశీలించారు. నీరు-చెట్టు పథకం పేరుతో తెలుగు తమ్ముళ్లు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాను నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.

     ఎవరూ ఊహించని షాకిచ్చారు!

    ఎవరూ ఊహించని షాకిచ్చారు!

    వైయస్ జగన్ లేదా వైసీపీ నేతలు ఎన్నోసార్లు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించి చంద్రబాబుపై మండిపడిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడని చెబుతూ విమర్శలు గుప్పించేవారు. కానీ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ నోటి నుంచి వస్తుందని దాదాపు ఎవరూ ఊహించకపోయి ఉండవచ్చు. అందుకు ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన పని లేదు.

    అనూహ్యం.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

    అనూహ్యం.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

    కానీ జగన్ అనూహ్యంగా ఈ అంశంతో చంద్రబాబును, టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేశారు. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు చందంగా జగన్ ప్లాన్ ఉందని అంటున్నారు. ఒకటి ఎన్టీఆర్ అభిమానుల సానుభూతిని పొందడం, వాటిని ఓట్లుగా మలుచుకోవడం, రెండు.. నేటి టీడీపీ ధర్మ పోరాట దీక్షను కార్నర్ చేయడం.

    బాబుకు జగన్ ఊహించని షాక్ వెనుక అసలు ఉద్దేశ్యం!

    బాబుకు జగన్ ఊహించని షాక్ వెనుక అసలు ఉద్దేశ్యం!

    టీడీపీ ధర్మ పోరాట దీక్షను కార్నర్ చేసేందుకే జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని చెబుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే టీడీపీ దీక్షను కార్నర్ చేయడం కంటే ఎన్టీఆర్ అభిమానుల సానుభూతిని పొందడమే అసలైన ఉద్దేశ్యంగా కనిపిస్తోందని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ దీక్షను కార్నర్ చేసేందుకు వైసీపీ చేపట్టిన వంచన వ్యతిరేక దీక్ష చాలునని, కానీ టీడీపీ దీక్షను పూర్తిగా కార్నర్ చేయడంతో పాటు సానుభూతి లక్ష్యంగా ఈ ప్రకటన చేశారని అంటున్నారు.

    టీడీపీకి దెబ్బ మీద దెబ్బ!

    టీడీపీకి దెబ్బ మీద దెబ్బ!

    వైసీపీ చెబుతున్న ప్రకారం.. 2014లో టీడీపీ పవన్ కళ్యాణ్ ప్రచారం, మోడీ హవాతో గెలిచారని, వారు ముగ్గురు కలిసినా వైసీపీ కేవలం 5 లక్షల ఓట్లతోనే ఓడిపోయిందని చెబుతున్నారు. తమ గెలుపు వెనుక పవన్ ఉన్నారని టీడీపీ నేతలు కూడ గతంలో చెప్పారు. అయితే, ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో పవన్ దూరమయ్యారు. దీంతో కాపులు, యువత టీడీపీకి దూరమవుతారని కొందరు లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల సానుభూతితో టీడీపీని దెబ్బ మీద దెబ్బ కొట్టాలని ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, కానీ ఏ మేర ఫలిస్తాయనేది 2019 ఎన్నికల్లో తేలుతుందని అంటున్నారు.

     నిన్న దెబ్బకొట్టిన పవన్ కళ్యాణ్, నేడు జగన్

    నిన్న దెబ్బకొట్టిన పవన్ కళ్యాణ్, నేడు జగన్

    ఈ నెల 22వ తేదీన చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ప్రత్యేక హోదా కోరుతూ 12 గంటల పాటు నిరహార దీక్ష చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు పెడుతూ దీక్షను కార్నర్ చేశారనే వాదనలు వినిపించాయి. సోమవారం టీడీపీ ధర్మ పోరాట దీక్షను కార్నర్ చేసేందుకు వైసీపీ వంచన వ్యతిరేక దీక్ష చేపట్టినప్పటికీ.. ఒక్క దెబ్బకు రెండు అన్నచందంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు అనే అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చి సంచలనం రేపారని అంటున్నారు.

     తెలుగు తమ్ముళ్ల ఆందోళన

    తెలుగు తమ్ముళ్ల ఆందోళన

    తమ ధర్మ పోరాట దీక్షను కార్నర్ చేసేందుకు జగన్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ.. జగన్ దీంతో టీడీపీని కార్నర్ చేశారని తెలుగు తమ్ముళ్లు మదన పడుతున్నారని అంటున్నారు. ఈ ఆలోచనతో జగన్ ఓ ముందడుగు వేశారని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+