Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీలో జగన్ కోవర్టులు ! రఘురామ బాటలోనే సీబీఐ మాజీ డైరెక్టర్ షాకింగ్..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ముఖ్యంగా సీట్ల పంపకాలు దాదాపుగా పూర్తి కావడంతో ఇక ప్రచారంపై దృష్టిపెడుతున్నాయి. ఇలాంటి సమయంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఎక్స్ లో సంచలన ట్వీట్ చేశారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.. తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకు ఈసారి టికెట్ రాకపోవడంపై చేసిన వ్యాఖ్యలతో నాగేశ్వరరావు వ్యాఖ్యలు మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి.

రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే దాదాపుగా టికెట్ల పంపకాలు పూర్తి చేసేశాయి. అయితే ఇందులో రఘురామకు టికెట్ రాకపోవడంతో బీజేపీలో ఉన్న సోము వీర్రాజు ద్వారా తనకు టికెట్ రాకుండా జగన్ అడ్డుకున్నారని సంచలన ఆరోపణ చేశారు. దీనిపై బీజేపీ నేతలెవరూ స్పందించలేదు. అయితే ఇప్పుడు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా ఇవే ఆరోపణలు చేస్తూ పోస్టు పెట్టారు.

after raghurama former cbi director nageswara rao also alleges ys jagan coverts in bjp

బీజేపీలో కొందరు నేతలు టీడీపీని, ఆ పార్టీలో అగ్రనేతల్ని విమర్శిస్తూనే ఉంటారని, అలాగే బీజేపీలో చాలా మంది వైఎస్ జగన్ కోవర్టులు ఉన్నారని అందరికీ తెలిసిందేనని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. వీరంతా చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ.. టీడీపీ, జనసేనతో ఎన్నికల పొత్తులోకి వెళ్లిందని, కానీ జగన్ తో ఇంత లోతైన బంధాలు తెంచుకుని పార్టీ కోసం ఆయా నేతలు పనిచేస్తారా అని ప్రశ్నించారు.

కానీ ఎన్డీయే ఏపీలో మెజార్టీ అసెంబ్లీ, లోక్ సభ సీట్లు సాధించాలంటే మాత్రం కేంద్ర నాయకత్వంలోని మోడీ, అమిత్ షా, నడ్డా జోక్యం చేసుకుని పార్టీలో కోవర్టుల్ని, జగన్ అనుకూల కుట్రదారుల్ని బీజేపీ విజయం కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలని హెచ్చరించాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సూచించారు. అప్పుడే రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయేకి మెజార్టీ సీట్లు వస్తాయన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+