Ambati Rayudu: జనసేనలోకి అంబటి రాయుడు ? పవన్ కళ్యాణ్ తో చర్చలు..!

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారు. తాజాగా వైసీపీలో చేరి పది రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసిన అంబటి రాయుడు.. ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు పవన్ తో రాయుడు చర్చలు జరిపారు.

Recommended Video

    Ambati Rayudu: జనసేనలోకి అంబటి రాయుడు ? Pawan Kalyan తో చర్చలు..! | telugu OneIndia

    వీరిద్దరి మధ్య చర్చల తర్వాత రాయుడు జనసేనలోకి చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికే చెందిన రాయుడికి జనసేన ఎక్కడి నుంచి పోటీ చేయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

    after resigned to ysrcp, former cricketer Ambati Rayudu plans to join janasena, talks with pawan

    తాజాగా క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పేసిన అంబటి రాయుడు వైసీపీ ప్రభుత్వానికీ, వైఎస్ జగన్ కూ అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఆయన్ను వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించింది. అప్పటికే గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు జరుపుతున్న అంబటి రాయుడు.. వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు గుంటూరు ఎంపీ సీటు కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరిగింది.

    కానీ పది రోజుల్లోనే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొనేందుకే తాను రాజకీయాలకు దూరమవుతున్నట్లు వెల్లడించారు. అయితే తెరవెనుక ఇంకేదో జరిగిందన్న ప్రచారం మాత్రం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తన మనసులో మాటను పవన్ కళ్యాణ్ కు వెల్లడించారు. దీంతో అంబటి రాయుడుని గతంలో తాను ఆశించిన గుంటూరు ఎంపీ సీటు నుంచి జనసేన పోటీ చేయిస్తుందా లేక మరే ఇతర సీటు కేటాయిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+