కరోనా నిధులూ వాడేసుకుంటారా ? జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్- సుప్రీంతీర్పు నేపథ్యం

ఏపీలో పీడీ ఖాతాలకు మళ్లించిన రూ.1100 కోట్ల కోవిడ్ నిధులను తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. దీంతో జగన్ సర్కార్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఆమలుచేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో విపక్షాలు సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ జగన్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కోవిడ్ విపత్తు నిధులనూ దారి మళ్ళించడం మానవత్వం లేని జగన్ పాలనకు నిదర్శనమిని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని, దారి మళ్లించిన నిధులను వెంటనే SDRF ఖాతాలో జమచెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి ఇష్టానుసార పాలనకు చెంపపెట్టులాంటివని చంద్రబాబు ఆక్షేపించారు.

తప్పులు చేస్తున్నదే కాకుండా, వాటిని సమర్థించుకోవడం కోసం వైసీపీ కొత్త తప్పులు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. కోవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను కూడా దారి మళ్ళించడం మానవత్వం లేని జగన్ వైఖరికి నిదర్శనమన్నారు. కోవిడ్ లేదా వరదల వంటి విపత్తులు వచ్చినప్పుడు అదనపు కేటాయింపులతో ప్రజలకు సాయం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం....ఇలా నిధులు మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చెయ్యడమేనని టీడీపీ అధినేత ఆక్షేపించారు.

after sc verdict, chandrababu slams ys jagan regime for diverting covid relief funds

కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, నాలుగు వారాల్లోగా ఫిర్యాదు పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పకుండా అమలుచెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. కోవిడ్ తో చిన్నాభిన్నం అయిన బాధిత కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+