సాయిరెడ్డి బాటలో మరో ఇద్దరు ఎంపీలు - జగన్ కు కోలుకోలేని దెబ్బ..!!

వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో నెంబర్ టూగా వ్యవహరించిన సాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రేపు తన రాజ్యసభ పదవికి రాజీ నామా చేస్తున్నట్లు వెల్లడించారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేసారు. అయితే, సాయిరెడ్డి బాటలోనే మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఆ ఇద్దరూ సైతం జగన్ కు అత్యంత సన్నిహితులే. ఈ ముగ్గురు రాజీనామాల వ్యవహారం జగన్ కు కోలుకోలేని దెబ్బ గా కనిపిస్తోంది.

వైసీపీకి భారీ షాక్
వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీ వీడారు. తాజాగా విజయ సాయిరెడ్డి అనూహ్య నిర్ణయం ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్న ట్లు ట్వీట్ చేసారు. జగన్ బాగుండాలని కోరుకుంటూనే..తాను ఏ పార్టీలో చేరటం లేదని చెప్పుకొ చ్చారు. వ్యక్తిగతంగా తీసుకుంటున్న నిర్ణయంగా పేర్కొన్నారు. తాను భవిష్యత్ తో వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేసారు. రాజ్యసభకు రేపు (శనివారం) రాజీనామా చేయాలని సాయిరెడ్డి నిర్ణయించారు. కాగా, ఈ షాక్ కు కొనసాగింపుగా వైసీపీకి చెందిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు సైతం పార్టీ వీడాలని నిర్ణయించినట్లు సమాచారం.

After Vijaya Sai Reddy decision two more mp s to resign for rajaysabha as reports

జగన్ సన్నిహితులుగా
జగన్ కు అత్యంత సన్నిహితంగా తొలి నుంచి ఉంటున్న ఆ ఇద్దరు ఇప్పుడు రాజీనామా చేసే ఆలోచన లో ఉండటంతో జగన్ అలర్ట్ అయ్యారు. వ్యాపారవేత్తగా ఉంటూ జగన్ సీఎం అయిన తరువాత రాజ్యసభకు ఎంపికైన ఆ నేత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సోదరుడు సైతం ఎమ్మెల్యేగా పని చేసారు. కాగా, 2024 ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు. పార్టీ అభ్యర్ధి కోసం పని చేసారు. ఫలితాల తరువాత ఆయన పూర్తిగా వ్యవసాయ పనులకు పరిమితం అయ్యారు. అదే విధంగా జగన్ ఏరి కోరి ఎంపిక చేసి రాజ్యసభ కు పంపిన మరో నేత సైతం రాజీనామా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందిజ

మరో ఇద్దరు సిద్దం
ఇలా..ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడాలనే నిర్ణయాలు వైసీపీ కేడర్ కు అంతు చిక్కటం లేదు. వచ్చే నెల తొలి వారం నుంచి జగన్ జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు. ఈ సమయంలో సాయిరెడ్డి లాంటి జగన్ కు అత్యంత సన్నిహితుడు.. మరో ఇద్దరు జగన్ సొంత మనుషులుగా ఉన్న రాజ్యసభ సభ్యుల నిర్ణయాల పైన అంతర్మధనం జరుగుతోంది. లండన్ పర్యటనలో ఉన్న జగన్ తో సాయిరెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. సాయిరెడ్డి నిర్ణయం వెనుక ఢిల్లీ పరిణామాలు కూడా కారణంగా పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో, ఇప్పుడు తాజా పరిణామాలు జగన్ సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారంలో ఉన్న ఆ ఇద్దరు ఎంపీల ప్రకటన ఏంటనేది మరింత ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+