వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో బీఆర్ఎస్ సందడి -అమలాపురంలో దర్శనమిస్తున్న బ్యానర్లు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను కాస్తా జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చేశారు. దీంతోపాటే తన బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ మారిన రోజే విజయవాడలో బ్యానర్లు దర్శనమివ్వగా.. ఇవాళ అమలాపురంలోనూ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి.

బీఆర్ అంబేద్కర్ జిల్లా కేంద్రం అమలాపురంలో ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే రేవు అమ్మాజీ పేరుతో ఈ వెలసిన బ్యానర్లు అమలాపురం పట్టణంలో చర్చకు దారి తీశాయి. రాష్ట్ర విభజనకు కారణమైన టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెంది బీఆర్ఎస్ గా మారడం, ఆ బ్యానర్లు అమలాపురం గడియారం సెంటర్లో కొందరు కట్టడంతో తీవ్ర చర్చనీయాంశం అవుతోది. ప్రస్తుతం ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

after vijayawada, now kcrs brs party banners tagged in amalapuram of konaseema district

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పూర్తిస్దాయిలో స్వాగతించేందుకు ఇక్కడి ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన సిద్దం కాలేదు. పైకి మాత్రం కొత్త రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చని చెప్తున్నాయి. దీంతో కేసీఆర్ త్వరలో ఏపీలో మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు పెట్టి మరీ తన జాతీయ పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని విజయవాడ, అమలాపురం ప్రాంతాల్లో బీఆర్ఎస్ బ్యానర్లు దర్శనమిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

English summary
kcr's brs party banners tagged in amalapuram of br ambedkar konaseema district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X