గన్నవరంలో మారుతున్న సీన్-యార్లగడ్డవైపు వెళ్లకుండా దుట్టాకు వైసీపీ బుజ్జగింపులు ?
గన్నవరం రాజకీయాల్లో తాజా మార్పులు ఏ పార్టీనీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ చేతిలో ఓడిన యార్లగడ్డ వెంకట్రావుతో పాటు ఆయనకు మద్దతిచ్చిన దుట్టా రామచంద్రరావుకు ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. వంశీకే జగన్ ప్రాధాన్యం ఇచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా ప్రకటించడంతో గుర్రుగా ఉన్న యార్లగడ్డ ఇప్పటికే పార్టీని వీడి టీడీపీలో చేరారు. దీంతో ఆయనకు మద్దతుగా ఉన్న దుట్టాను బుజ్జగించేందుకు వైసీపీ రంగంలోకి దిగింది.
కృష్ణాైజిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో వైసీపీ నేత దుట్టా రామచంద్ర రావుతో బందరు ఎంపీ బాలశౌరి ఇవాళ భేటీ అయ్యారు. 2019 లో యార్లగడ్డ వెంకట్రావు కి సపోర్ట్ చేసిన దుట్టా రామచంద్రరావు....వంశీ పార్టీలోకి వచ్చాక ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. కానీ జగన్ కూడా వంశీకే అండగా నిలవడంతో అసంతృప్తిగా ఉన్నారు. కానీ తాజాగా యార్లగడ్డ టీడీపీలో చేరాక ఆయనకు మద్దతుగా ఉన్న దుట్టా మౌనంగా ఉన్నారు. దీంతో ఆయన కూడా టీడీపీకి వెళ్లిపోతారన్న చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తర్వాత దుట్టా రామచంద్ర రావుతో భేటీ అయిన బాలశౌరి.. వైసీపీలో కొనసాగేలా ఆయనతో చర్చలు జరిపారు.దుట్టా రామచంద్రరావు వైసీపీ నుంచి 2014లో గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. . 2014 నుంచి2019 వరకు గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రత్యేక వర్గం కూడా ఉంది. దీంతో దుట్టాను బుజ్జగించి వంశీకే మద్దతిచ్చేలా చూసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.
దుట్టాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలశౌరి.. నియోజకవర్గంలో ఉండి పార్టీ కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి కోసం అహర్నిశలు పనిచేసిన నేత అంటూ ప్రశంసించారు. వైయస్సార్ పార్టీ పుట్టినరోజు నుంచి పార్టీలో చేరిన వ్యక్తి దుట్టా అన్నారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా అన్నారు. దుట్టా వైసీపీకి విధేయులు, జగన్మోహన్ రెడ్డి కోసం అహర్నిశలు పనిచేసే వ్యక్తి అన్నారు. తనకూ దుట్టా రామచంద్ర రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.
మరోవైపు 30 సంవత్సరాలు నుంచి బాలశౌరికీ తనకూ పరిచయం ఉందని దుట్టా తెలిపారు. తామిద్దరం వైఎస్సార్ శిష్యులం అన్నారు. మొదటినుంచి కాంగ్రెస్ లో పనిచేశానని, తర్వాత వైసీపీకిు పనిచేస్తున్నానని దుట్టా తెలిపారు. బాల శౌరి కాల్ చేసి లంచ్ కి రమ్మంటే తనకు కుదరక.. ఆయన్నే రమ్మంటే వచ్చారన్నారు. సీఎంఓలో పార్టీ గురించి సీఎం జగన్ తో చెప్పానని,పార్టీ గురించి సీఎం గారికి ఏం చెప్పానో బాలశౌరి కి అదే చెప్పానని దుట్టా తెలిపారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications