విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎజిఎం మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న ఎజిఎం అరవింద్ మాలవ్యా ప్రమాదవశాత్తు మరణించారు. గురువారంనాడు ఆయన సింటర్ ప్లాంట్ నుంచి జారి పడడంతో ఆ ప్రమాదం సంభవించింది.

పైనుంచి పడడంతో ఆయన తలకు తీవ్రమైన గాయమైంది. వెంటనే సిబ్బంది స్పందించి ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అరవింద్ మాలవ్యా మరణించారని వైద్యులు వెల్లడించారు. ఆయన మిషన్‌లో జారి పడినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరిలో విశాఖ ఉక్కు కర్మాగారంలో పైనాన్స్ ఎజిఎం సూర్యప్రసాద్ ఒడిషాలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు.












Click it and Unblock the Notifications