చంద్రబాబు అరెస్ట్ పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ రాజకీయంగా అనేక మలుపులు తీసుకుంటోంది. టీడీపీ అధినేత అరెస్ట్ పైన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు కోర్టుల్లో చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ రోజు సుప్రీం(Supreme Court)లో చంద్రబాబు క్వాష్ పిటీషన్ ప్రస్తావనకు రానుంది. అటు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరగనుంది. ఈ సమయంలోనే ఎంఐఎం అధినేత అసద్(Asaduddin) ఈ మొత్తం వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

స్పందించిన అసద్:ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ పాలనా వ్యవహారాలు..పార్టీ విస్తరణ..బలోపేతం పైన చర్చించారు. ఆ సమయంలోనే చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ గురించి కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. దీని పైన అసద్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రుడు ఏపీ జైల్లో హ్యాపీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అందిరకీ తెలుసని పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం రెండు పార్టీలే ఉన్నాయని...ఒకటి టీడీపీ(TDP) అయితే, రెండోది జగన్ పార్టీ వైసీపీ(YCP) అని వివరించారు. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంచి పాలన అందిస్తున్నారని అసద్ ప్రశంసించారు.

AIMIM Chief Asaduddin sesnational comments on Chandra Babu arrest, reacts on AP Politics

చంద్రుడు హ్యాపీగా ఉన్నారు:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రం ఎప్పటికీ నమ్మలేని...ప్రజలు కూడా ఆయనను నమ్మవద్దని అసద్ సూచించారు. ఏపీ(AP)లో ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందని అసద్ వెల్లడించారు. ఏపీలో ఎంఐఎం (AIMIM)పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తమ పార్టీ కార్యకర్తలను వేధించే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుర్తు పెట్టుకుంటామంటూ అసద్ హెచ్చరించారు.

బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్‌ఎస్‌(BRS)కు సపోర్ట్ చెయ్యాలని పార్టీ సభ్యులకు కార్యకర్తలకు, ఓటర్లకు స్పష్టం చేశారు. తెలంగాణలో 9 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పరిపాలన నడుస్తుందని, ఎలాంటి మతకలహాలకు చోటు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ ప్రశంసించారు.

AIMIM Chief Asaduddin sesnational comments on Chandra Babu arrest, reacts on AP Politics

జగన్ పాలన బాగుంది:తాము సమస్యలపైన పోరాటం చేస్తున్నామని..పదవులపైన ఆశలు లేవని చెప్పుకొచ్చారు. ఇక, అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ జగన్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా చేసిందంటూ టీడీపీ(TDP) ఆరోపిస్తోంది.

ఇప్పటికే పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచారు. బీఆర్ఎస్ నుంచి అధికారిక స్పందన లేకపోయినా కొందరు నేతలు చంద్రబాబు అరెస్ట్ ను తప్పు బట్టారు. అటు బీజేపీ(BJP) అధినాయకత్వం స్పందించలేదు. ఇక, ఇప్పుడు ఎంఐఎం అధినేత చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీని పైన టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+