లో దుస్తుల్లో గోల్డ్: చంచల్‌గూడ జైలుకు ఎయిర్ హోస్టెస్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం 13 కిలోల బంగారం పట్టుబడిన కేసులో అరెస్టు చేసిన ఎమిరేట్స్ ఎయిర్ హోస్టెస్ సదా ఖాన్ అలియాస్ ఫాతిమాను పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఆమెకు నాంపల్లి కోర్టు పద్నాలు రోజుల రిమాండ్ విధించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు సౌజత్ అలీను కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుండి ఈ రోజు హైదరాబాదుకు తీసుకు వచ్చారు. అతనిని కూడా కోర్టులో హాజరు పర్చనున్నారు.

కోర్టు రిమాండ్ విధించిన ఎయిర్ హోస్టెస్‌ను పోలీసులు మహిళా చంచల్ గూడ జైలుకు తరలించారు. ఎయిర్ హోస్టెక్ దోహా నుండి ఈ పదమూడు కిలోల బంగారం తీసుకు వచ్చారు. ఇదిలా ఉండగా.. వీరు భయ్యా అనే వ్యక్తికి బంగారం సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అతని కోసం గాలిస్తున్నారు.
కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. బుధవారం ఒక్కరోజే 15 కిలోల బంగారం కస్టమ్స్ అధికారులకు చేతికి చిక్కింది. పట్టుబడిన బంగారం విలువ కోట్లలో ఉంటుంది. బుధవారం తెల్లవారుజాము నుంచి జరిపిన తనిఖీల్లో ఓసారి 2.75 కిలోలు, మరోసారి ఏకంగా 13 కిలోల బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి.












Click it and Unblock the Notifications