అత్యంత చౌకగా విమానం టికెట్లు... ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మంచి ఆఫర్ ప్రకటించింది. తగ్గింపు ధరలకే విమాన టికెట్లను అందిస్తోంది. టైమ్ టూ ట్రావెల్ పేరుతో ఎంపిక చేసిన మార్గాల్లో అత్యంత చవకగా విమాన ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్ కింద టికెట్లు తీసుకుంటే 2024 జనవరి 11 నుంచి 2025 జనవరి వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. టికెట్ ధర రూ.1,799 నుంచి ప్రారంభం కానున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.
బెంగళూరు- చెన్నై, ఢిల్లీ జైపూర్, బెంగళూరు- కొచ్చి, ఢిల్లీ- గ్వాలియర్, కోల్‌కతా- బాగ్‌డోగ్రా మార్గాల్లో విమాన ప్రయాణం చేయడానికి ఎయిర్ లైన్స్ నెట్‌వర్క్ ద్వారా ఈ ఆఫర్ అందుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రీడిజైన్ చేయసిన బ్రాండ్ గుర్తింపును తెలిపింది. డిజిటల్ విధానంలో ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రయాణం చేసుకునే అవకాశం ఉంది.

గౌర్‌మైర్ హాట్ మీల్స్, సౌకర్యవంతమైన సీట్లు, ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ ఎయిర్‌ఫ్లిక్స్, ప్రత్యేక లాయల్టీలు అందుతున్నాయి. టికెట్లు బుక్ చేసుకునేవారిలో న్యూపాస్ రివార్డ్ ప్రోగ్రామ్ సభ్యులకు ప్రయారిటీ ఇవ్వనున్నట్లు తెలిపింది. న్యూపాస్ రివార్డ్ ప్రోగ్రామ్ సభ్యులు 8 శాతం న్యూకాయిన్స్ పొందుతారు. ఇవేకాకుండా అదనంగా ఇంకా ఎన్నో లాభాలను అందిస్తున్నామని, ఉపయోగించుకోవాలని సూచించింది.
టైమ్ టూ ట్రావెల్ ఆఫర్ ద్వారా కేవలం రూ.1799కే ఎయిర్ ఇండియా విమాన టికెట్ బుక్ చేసుకోవచ్చు. లాయల్టీ మెంబర్స్, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, ఎస్ఎంఈ, డిపెండెంట్స్, సాయుధ దళాల సభ్యులకు స్పెషల్ ఆఫర్ ఉంది. ఎయిరిండియా ఎయిర్ లైన్స్ యాప్, వెబ్‌సైట్ ద్వారా ఈ రాయితీ విమానం టికెట్లు కొనుగోలు చేయవచ్చు.












Click it and Unblock the Notifications