పొగమంచు గుప్పిట్లో విమానాశ్రయాలు: సర్వీసులకు అంతరాయం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన విమానాశ్రయాలు శంషాబాద్, గన్నవరం విమానాశ్రయాలను పొగమంచు కప్పేసింది. దీంతో శుక్రవారం ఉదయం రెండు విమానాశ్రయాల్లో పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు ఆలస్యంగా వస్తాయని అధికారులు వెల్లడించారు.

Air India to fly Gannavaram to tirupati from January 30

విజయవాడ నుంచి హైదరాబాద్, తిరుపతికి ఎయిర్ ఇండియా సర్వీసులు

విజయవాడ నుంచి హైదరాబాద్, తిరుపతికి శుక్రవారం నుండి ఎయిరిండియా సర్వీసులు ప్రారంభించింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఇప్పటికే న్యూఢిల్లీకి రెండు సర్వీసులను ఎయిర్ ఇండియా నడుపుతున్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడ రాజధాని అయిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒకేరోజు రెండు సర్వీసులను ఎయిరిండియా అధికారులు ప్రారంభించారు. ఎయిర్ ఇండియా విమానం ప్రతిరోజు ఉదయం 7.45కు హైదరాబాద్ లో బయల్దేరి 8.55 గంటలకు గన్నవరం చేరుకుంటుంది.

తిరిగి 9.25కు ఇక్కడ నుంచి బయలుదేరి 10.45కు తిరుపతి చేరుకుని అక్కడ నుంచి అరగంట విరామం అనంతరం 11.15కు బయల్దేరి తిరిగి 12.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుందని వెల్లడించారు. అలాగే మధ్యాహ్నం 1.05 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 2.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

మరో వారం రోజుల వ్యవధిలో చెన్నై, బెంగళూరు, వైజాగ్ కు కూడా ఇక్కడనుంచి విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిరిండియా సన్నాహాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+