పేలిన టైరు: రేణిగుంటలో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
చిత్తూరు: రేణిగుంట విమానాశ్రయంలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. దీంతో అందులోని 178 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు. విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో టైర్ పేలింది. పైలట్ అప్రమత్తం అయ్యారు.
పైలట్ అప్రమత్తం కారణంగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా వచ్చింది. తిరిగి రేణిగుంట నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లవలసి ఉంది.

టైరు పేలిపోవడంతో ప్రయాణీకులను తిరుపతిలోనే ఉంచారు. ప్రయాణీకులను మరో విమానంలో హైదరాబాద్ అక్కడి నుంచి ఢిల్లీకి పంపించనున్నారు. 178 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications