హైదరాబాద్​, తిరుపతి, విశాఖ వాసులకు బిగ్ అలర్ట్.. నిర్లక్ష్యం వద్దు..!!

వాతావరణంలో వస్తున్న మార్పులతో కొత్త సమస్యలు మొదవుతున్నాయి. పెరుగుతున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. తిరుపతి, హైదరాబాద్​, విశాఖపట్నం నగరాల్లో గాలి నాణ్యత వేగంగా పడిపోతోంది. మున్ముందు మరింత ఆందోళనకర స్థాయికి చేరుకోవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీర్ఘకాలం ఇలాంటి వాతావరణం కొనసాగితే శ్వాస సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాంతాల్లో కొత్త సమస్య మొదలైంది. వాయు కాలుష్యం పెరుగుతోంది. గాలి నాణ్యత వేగంగా పడిపోతోంది. నమోదయ్యే గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ)ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్ధారించి ప్రతి 24 గంటలకు ఒకసారి బులెటిన్​ రూపంలో విడుదల చేస్తుంది. తాజాగా విడుదలైన బులెటిన్​లో తెలుగు రాష్ట్రాలోని నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. హైదరాబాద్​లో నవంబరు 5వ తేదీన 68గా ఉన్న గాలి నాణ్యత సూచీ 11వ తేదీకి 102 పాయింట్లకు చేరుకుంది. జూపార్క్​(164), ఇక్రిశాట్​ (142), ఐడీఏ పాశమైలారం(136)లలో కాలుష్యం ఎక్కువగా నమోదవుతోంది. కాలుష్యం కారణంగా ఆస్తమా, హృద్రోగ బాధితులకు అసౌకర్యం కలగవచ్చు.

air-pollution-becomes-big-problem-for-main-cities-in-ap-and-telngana-details-here

ఈ కాలుష్యం పెరుగుతున్న వేళ దుమ్ము, పొగ ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండొద్దని వైద్యు లు సూచిస్తున్నారు. (0-50) మధ్య గాలి నాణ్యత చాలా బాగున్నట్లు. ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉండదు. (51-100) మధ్య గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉన్నట్లు. పిల్లలు, వృద్ధు లు, ఊపిరితిత్తుల సమస్యలుండే వారికి కొంత వరకు అసౌకర్యంగా ఉంటుంది. ఇక.. 101-200 మధ్య ఉంటే ఊపిరితిత్తులు, గుండె సమస్యలు ఉన్నవారికి శ్వాసలో ఇబ్బందలు కలగవచ్చు.

అదే విధంగా 201-300 మధ్యన ఉండే వాతావరణంలో చాలామంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. 301-400 మధ్య గాలి నాణ్యత అధ్వానంగా ఉన్నట్లు. దీర్ఘకాలం ఇలాంటి వాతావరణం కొనసాగితే శ్వాస సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. దీంతో.. వాతావరణం బాగా చల్లగా ఉంటే ఇంట్లోనే ఉండాలి. ఎండ వచ్చాకే బయటకు వెళ్లడం మంచిదని.. అవసరమైతే మంచి మాస్క్​ పెట్టుకుని వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+