Vijayawada Airport: కేంద్రం చేతుల్లోకి విజయవాడ ఎయిర్ పోర్టు! కీలక నిర్ణయం..
ఏపీలో, కేంద్రంలో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు వేళ రాష్ట్రానికి మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందబోతున్న అమరావతికి కీలకమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పడిన మోడీ సర్కార్ లో పౌర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు విజయవాడ ఎయిర్ పోర్టుకు ఈ శుభవార్త చెప్పారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం ఎయిర్ పోర్టును విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగా అప్ గ్రేడ్ చేశారు.దీంతో అంతర్జాతీయ స్ధాయిలో విమానాలు ఇక్కడికి రావడం ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో విమానాల రాకపోకలు తగ్గాయి. అదే సమయంలో విమానాశ్రయ భద్రత కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండిపోయింది. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతను రాష్ట్ర పోలీసులే చూసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతను సీఐఎస్ఎఫ్ కు అప్పగిస్తూ భారత విమానాశ్రయాల ప్రాథికార సంస్థ (ఏఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 2 నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతను కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలకు అప్పగిస్తున్నట్లు ఇవాళ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు భద్రత నుంచి తప్పుకోవాలని కూడా సూచించింది. అలాగే ఎయిర్ పోర్టులోని క్వార్టర్ట్స్ ను కూడా వారు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications