కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను జైల్లో చూసొచ్చి నా తల్లి ఏడ్చేది: అఖిల కౌంటర్, భూమా 'బాధ'పై

తన తండ్రి భూమా నాగిరెడ్డి మానసిక వేధన గురించి ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ మంగళవారం నాడు ఆవేదనతో చెప్పారు. అమ్మ చనిపోయినప్పటి నుంచి నాన్న కోలుకోలేకపోయారని ఆవేదనగా చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తన తండ్రి భూమా నాగిరెడ్డి మానసిక వేధన గురించి ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ మంగళవారం నాడు ఆవేదనతో చెప్పారు. అమ్మ చనిపోయినప్పటి నుంచి నాన్న కోలుకోలేకపోయారని ఆవేదనగా చెప్పారు.

<strong>భూమా నాగిరెడ్డి సంతాపం: సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్</strong>భూమా నాగిరెడ్డి సంతాపం: సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్

తన తండ్రి లోపల ధైర్యంగా ఉన్నప్పటికీ లోలోన చాలా మథన పడ్డారని తెలిపారు. చనిపోవడానికి వారం రోజుల ముందు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ పెట్టుకొని టెలికాన్ఫరెన్సులో మాట్లాడారని తెలిపారు.

నాన్నను బతికించుకునేందుకు చివరి వరకు ప్రయత్నించామని చెప్పారు. చివరి వరకు నాన్న నియోజకవర్గ అభివృద్ధి కోసం తపించారని తెలిపారు. అమ్మ చనిపోయినప్పటి నుంచి నాన్న కోలుకోలేకపోయారని చెప్పారు.

నాకు భరించలేనంత బాధగా ఉన్నా...

నాకు భరించలేనంత బాధగా ఉన్నా...

తాను చిన్న పిల్లను కావొచ్చని, రాజకీయాలకు కొత్త కావొచ్చునని అఖిల ప్రియ అన్నారు. కానీ హామీలు మాత్రం నెరవేరుస్తామని చెప్పారు. తనకు భరించలేనంత బాధ ఉన్నా అమ్మా, నాన్నలు అందరికీ ఎప్పటికి గుర్తుండేలా పనులు చేస్తామని చెప్పారు.

జగన్‌పై అఖిలప్రియ

జగన్‌పై అఖిలప్రియ

భూమా నాగిరెడ్డి మృతిపై తీర్మానం సమయంలో ప్రతిపక్షం మాట్లాడుతుందని భావించామని అఖిల ప్రియ అన్నారు. భూమా గురించి మాట్లాడవలసి వస్తుందని జగన్ రాకపోవడం బాధగా ఉందన్నారు. మాకు వారు ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు. రాకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.

జగన్‌ను జైల్లో చూసొచ్చాక నా తల్లి ఏడ్చేవారు

జగన్‌ను జైల్లో చూసొచ్చాక నా తల్లి ఏడ్చేవారు

జగన్ జైల్లో ఉన్నప్పుడు తన తల్లి శోభా నాగిరెడ్డి తమను వదిలేసి జైలుకు వెళ్లి ఆయనను కలిసి వచ్చేదన్నారు. వెళ్లి ఇంటికి వచ్చాక తమను దగ్గరకు తీసుకొని ఏడ్చేదన్నారు.

నాకెవరు చెప్పలేదని జగన్‌కు కౌంటర్

నాకెవరు చెప్పలేదని జగన్‌కు కౌంటర్

అసెంబ్లీకి రావాలని తనను ఎవరూ అడగలేదని చెప్పారు. తండ్రి చనిపోయిన రెండు రోజులకే అఖిలను సభకు తీసుకు రావడాన్ని జగన్ ప్రశ్నించారు. దీనిపై అఖిల ప్రియ పైవిధంగా స్పందించారు. రావాలని తనకు ఎవరూ చెప్పలేదన్నారు. కొత్త అసెంబ్లీలో నాన్న సంతాప తీర్మానంలో మాట్లాడాల్సి వస్తుందనుకోలేదన్నారు.

జగన్‌పై పల్లె ఆగ్రహం

జగన్‌పై పల్లె ఆగ్రహం

జగన్‌ది ఫ్యాక్షనిస్ట్, శాడిస్ట్ మెంటాలిటీ అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ తీరు ఆయన స్థాయిని పాతాళానికి నెట్టిందన్నారు. ఆయనది విచిత్రమైన, విడ్డూరమైన మనస్తత్వం అన్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేతను ఎంత వరకు చూడలేదన్నారు.

జగన్ కుటుంబం కోసమే భూమా వైసిపిలో చేరారు

జగన్ కుటుంబం కోసమే భూమా వైసిపిలో చేరారు

వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత జగన్ కుటుంబం కోసమే దివంగత భూమా నాగిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. సభలో సంతాప తీర్మానం అనంతరం ఆయన మండలిలో మాట్లాడారు.

జగన్ సైకో సిద్ధాంతాల వల్లే తిరిగి టిడిపిలోకి

జగన్ సైకో సిద్ధాంతాల వల్లే తిరిగి టిడిపిలోకి

జగన్ సైకోలా మారారని మండిపడ్డారు. భూమా నాగిరెడ్డిపై సంతాప తీర్మానాన్ని బహిష్కరించడం దారుణమని వ్యాఖ్యానించారు. జగన్ సైకో సిద్ధాంతాలు చూసి తట్టుకోలేకే భూమా టిడిపిలోకి తిరిగి వచ్చారన్నారు. జగన్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు.

English summary
Allagadda MLA and Telugudesam Party leader Akhila Priya on Tuesday questioned Why YS Jaganmohan Reddy not attended Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X