నాగార్జున పొలిటికల్ ఎంట్రీపై పుకార్లు: అమల స్పందన ఇదీ...
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున రాజకీయాల్లో అడుగు పెడుతారనే పుకార్లపై ఆయన సతీమణి అమల స్పందించారు. అక్కినేని నాగార్జున వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున రాజకీయాల్లో అడుగు పెడుతారనే పుకార్లపై ఆయన సతీమణి అమల స్పందించారు. అక్కినేని నాగార్జున వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా గుంటూరు నుంచి గానీ విజయవాడ నుంచి గానీ ఆయన పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్‌తో నాగార్జున సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆధారంగా చూపిస్తూ ఆయన వైసీపీలోకి వెళుతున్నారంటూ సోషల్‌మీడియాలో చర్చలు సాగాయి. ఈ విషయంపై నాగార్జున సతీమణి అమల స్పందించారు.

Recommended Video

Nagarjuna Akkineni to Join YSRCP? Breaking News!
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తల్లో వాస్తవం లేదని అమల స్పష్టం చేశారు. అవన్నీ కేవలం పుకార్లేనని ఆమె అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకూడదని అమల సూచించారు. నాగార్జున ఏ పార్టీలోకి వెళ్లడం లేదని ఆమె స్పష్టం చేసారు.
ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మీడియా సమావేశం పెట్టి ప్రకటిస్తామని ఆమె చెప్పారు. గతంలో కూడా నాగార్జున విషయంలోనే కాకుండా అమల విషయంలోనూ ప్రచారం సాగింది.












Click it and Unblock the Notifications