వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసకు షాక్: కాంగ్రెస్‌లోకి ఆకుల, కెసిఆర్ త్రీడి ప్రచారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akula returns to Congress
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మల్కాజిగిరి శాసన సభ్యుడు ఆకుల రాజేందర్ వారం తిరగకుండానే మళ్లీ సొంత గూటికి చేరుకొని.. కెసిఆర్‌కు షాకిచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఆయనకు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించలేదు.

తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగి ఉంటేనైనా టిక్కెట్ లభించేదమోనని ఆయన అనుయాయులు అంటున్నారు. అయితే తెరాసలో కూడా టిక్కెట్ రాదేమోనన్న అనుమానంతోనే ఆయన తిరిగి కాంగ్రెసు పార్టీలోకి వచ్చారని భావిస్తున్నారు. కాగా, మల్కాజిగిరి టిక్కెట్‌ను కాంగ్రెసు పార్టీ కందికంటి శ్రీధర్‌కు ఇచ్చింది.

కెసిఆర్ ప్రచారం

కెసిఆర్ బుధవారం నుంచి సాధారణ ఎన్నికల ప్రచారానికి స్వీకారం చుట్టబోతున్నారు. సాయంత్రం నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో పార్టీ నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పలువురు ఈ సందర్భంగా తెరాసలో చేరుతున్నారని పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం మీడియాకు తెలిపారు. హుజూర్‌నగర్ నుంచి తెరాస తరఫున మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతా చారి తల్లి కె శంకరమ్మ పోటీ చేస్తున్నారు.

పార్టీ బలంగాలేని అసెంబ్లీ సీటు శంకరమ్మకు ఇచ్చారనే విమర్శల నేపథ్యంలో కెసిఆర్ అక్కడి నుంచే ఈసారి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కెసిఆర్ పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించగా, కేవలం అక్కడే కాకుండా మెదక్ లోకసభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేయటం దాదాపుగా ఖాయమైంది. ఈ రెండు స్థానాలకు బుధవారం నామినేషన్లు దాఖలు చేయాలని కెసిఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఆ రోజు ఉదయమే మెదక్ జిల్లా నంగనూరు మండలం కోనాయపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లనున్నారు. తెరాసను 2001లో స్థాపించటానికి ముందే కాకుండా, గడిచిన 13 ఏళ్లుగా ప్రతి ముఖ్యమైన పని ప్రారంభించటానికి ముందు కెసిఆర్ కోనాయపల్లి ఆలయాన్ని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం ఆలయంలోని దేవుడి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు నిర్వహిస్తారు.

అనంతరం నేరుగా జిల్లా కేంద్రం సంగారెడ్డికి వెళ్లి మెదక్ లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు. తదుపరి గజ్వేల్‌కు వెళ్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత హుజూర్‌నగర్ సభకు బయలుదేరి వెళ్తారు. 12న మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో, సాయంత్రం కరీంనగర్‌లో, 13న చేవెళ్ల, నల్గొండలో ఏర్పాటుచేసే బహిరంగ సభల్లో కెసిఆర్ పాల్గొంటారు.

మరోవైపు కెసిఆర్ ప్రతిరోజు పగలు హెలికాప్టర్‌లో మూడు ప్రాంతాలు, సాయంత్రం నుంచి రాత్రి వరకు రోడ్డు మార్గంలో మరో మూడు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా షెడ్యూల్‌ను ఖరారు చేస్తున్నట్లు పార్టీ ముఖ్యులు తెలిపారు. త్రీడీ పద్ధతిలో కెసిఆర్ ఎన్నికల ప్రచారం కోసం 20 వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి వాహనం ద్వారా రోజుకు రెండుచోట్ల త్రీడీ ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
Malkajgiri MLA Akula Randender returned to Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X