టైగర్ ఆలె నరేంద్ర మృతి, కన్నీరుమున్నీరు (పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత టైగర్ ఆలె నరేంద్ర బుధవారం సాయంత్రం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆలె నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం అంబర్ పేట స్మశాన వాటికలో ముగిశాయి.
1946 ఆగస్టు 21న జన్మించిన నరేంద్రను అందరూ టైగర్‌గా వ్యవహరించేవారు. ఇంటి పేరు ఆలె బదులు అంతా టైగర్ నరేంద్ర అని వ్యవహరించేవారు.
13, 14 లోక్‌సభల్లో ఆయన మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. హిమాయత్‌నగర్ శాసనసభ స్థానం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆలె నరేంద్ర
జనసంఘ్ నేతగా.. బిజెపి నాయకుడిగా.. తెలంగాణ ఉద్యమ నేతగా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సాగించిన ఆలే నరేంద్ర హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన..బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. మధుమేహం, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు.

ఆలె నరేంద్ర
మంగళవారం ఉదయం ఆయనకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. రక్తపోటు బాగా తగ్గిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు క్రిటికల్ కేర్ యూ నిట్‌లో చేర్చుకుని చికిత్స చేశారు. కానీ, అప్పటికే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శరీరంలో ఇన్‌ఫెక్షన్ సోకిందని, మూత్రపిండాలు విఫలమయ్యాయని, మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్‌తో సాయంత్రం 4 గంటల సమయంలో చనిపోయారని వైద్యులు తెలిపారు.

ఆలె నరేంద్ర
నరేంద్ర భౌతిక కాయాన్ని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం రెండు గంటలసేపు కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. 11 గంటల తర్వాత పాతబస్తీలో ఊరేగించి, అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఆలె నరేంద్ర
నరేంద్ర హైదరాబాద్‌లోని నారాయణగూడలో 1946 ఆగస్టు 21న జన్మించారు. ముంతాజ్ కాలేజీలో బిఎస్సీ పూర్తి చేసిన ఆయన, చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ సభ్యుడుగా ఉన్నారు. పదిహేడేళ్ల వయసులో జనసంఘ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. సిమ్లా ఒప్పందానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పాల్గొని తీహార్ జైల్లో నెలపాటు శిక్షననుభవించారు.

ఆలె నరేంద్ర
1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి 18 నెలలపాటు జైల్లో ఉన్నారు. 1969-1972 వరకూ జన్‌సంఘ్‌కు ఫుల్‌టైమర్‌గా పని చేశారు. జనసంఘ్ జనతా పార్టీలో విలీనమైన తర్వాత 1980లో మొదటిసారిగా ఆ పార్టీ అభ్యర్థిగా హైదరాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. 1983లో బిజెపి అభ్యర్థిగా చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే ఏడాది హిమాయత్‌నగర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందారు.

ఆలె నరేంద్ర
1985, 92ల్లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర 1996, 1998 ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్‌కు పోటీ చేసి పరాజయం చెందారు. 1999 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఈ సీటు దక్కించుకున్నారు.

ఆలె నరేంద్ర
2001లో తెలంగాణ సాధన సమితి స్థాపించి, 2002లో తెరాస విలీనం చేశారు. 2004 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గెలుపొంది.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. కెసిఆర్‌తో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్‌కు చేరువయ్యారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.

ఆలె నరేంద్ర
నరేంద్ర మృతికి ప్రముఖ నేతలు సంతాపం తెలిపారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ, అగ్రనేత ఆడ్వాణీ, సీనియర్ నేత వెంకయ్యనాయుడు, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పాతబస్తీలో మజ్లిస్‌కు వ్యతిరేకంగా నిలిచి ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారని కిషన్ రెడ్డి శ్లాఘించారు. తెలంగాణ ప్రజలకు ఎనలేని సేవలు అందించిన నరేంద్ర మృతితో బిజెపి, తెలంగాణ ప్రజలు ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్లయిందని చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications