తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ విషయంలో మార్పు !
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి శ్రీవారిమెట్టు మార్గం ద్వారా కాలినడకన వచ్చే భక్తులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు శ్రీవారిమెట్టులో ఉన్న దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్‌కు తరలించినట్లు టీటీడీ ప్రకటించింది.
ఈ కొత్త కౌంటర్లు జూన్ 6, 2025 (శుక్రవారం) సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్పు వల్ల శ్రీవారిమెట్టు మార్గంలో వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా టోకెన్ల లభ్యత ఉంటుంది.

భక్తులకు గమనిక..
దివ్యదర్శనం టోకెన్లు 'ఫస్ట్ కమ్ - ఫస్ట్ సర్వ్' ప్రాతిపదికన భూదేవి కాంప్లెక్స్‌లోనే జారీ చేయబడతాయి.
టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి.
శనివారం దర్శనానికి కావలసిన టోకెన్లు జూన్ 6 సాయంత్రం నుంచే జారీ చేయబడతాయి.
స్కానింగ్ ప్రక్రియ తప్పనిసరి
టోకెన్ పొందిన భక్తులు, శ్రీవారిమెట్టు మార్గంలో 1,200వ మెట్టు వద్ద ఏర్పాటు చేసిన స్కానింగ్ కేంద్రంలో తమ టోకెన్‌ను స్కాన్ చేయించుకోవాలి. స్కానింగ్ తర్వాతే భక్తులు దర్శనానికి అనుమతించబడతారు. అలానే సర్వదర్శనం టోకెన్లకు కూడా అదే ప్రక్రియ కొనసాగనుంది. ఇకపై అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లోనే వాటిని కూడా జారీ చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.












Click it and Unblock the Notifications