ఎపిలో...ఎంసెట్‌తో సహా వివిధ సెట్ల తేదీలివే....ప్రకటించిన మంత్రి గంటా

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఎపిలో నిర్వహించనున్న వివిధ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలను విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. సోమవారం అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి గంటా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడించారు.

రాష్ట్రంలో నిర్వహించే వివిధ సెట్ల పరీక్షల తేదీలను ప్రకటించిన మంత్రి గంటా ఈ ఎంట్రెన్స్ టెస్ట్ లన్నీఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, వారంలోపే ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు.

All CETs to Go Online In AP State Said Minister Ganta Srinivasa Rao

ఎంసెట్ నిర్వహణకు 115 నుంచి 150 వరకు సెంటర్లను ఏర్పాటు చేస్తామని గంటా ప్రకటించారు. అలాగే విశాఖలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను యూనిర్సిటీగా మార్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ యూనివర్సిటీకి అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి గంటా తెలిపారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జరగబోయే వివిధ ఎంట్రెన్స్ సెట్ల పరీక్షల తేదీలు ఇవి..

ఏప్రిల్ 19న ఎడ్‌సెట్, లాసెట్
ఏప్రిల్‌ 22 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష
ఏప్రిల్‌ 26న ఏపీ ఎంసెట్‌ మెడిసిన్‌ పరీక్ష
మే 2న ఐసెట్‌
మే 3న ఈసెట్‌
మే 4న పీయూ సెట్‌
మే 10 నుంచి 12 వరకు పీజీ సెట్

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
For the first time in India, all the common entrance examinations (CETs) Will go online in Andhra Pradesh in 2018. Education minister Ganta Srinivasa Rao announced the names of the Varsities, which conduct these entrance examinations in 2018, on monday in amaravathi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి