సీఎం కాగానే విజయ్ కు ఊహించని వరం, AIADMK ఎమ్మెల్యేల మద్దతు..!?
తమిళనాడులో విజయ్ సీఎం కాగానే కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమిలో పార్టీల మద్దతు తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్ కు ప్రస్తుతం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే, ఇదే సమయంలో అన్నా డీఎంకే లో చీలక ఖాయంగా కనిపిస్తోంది. పళిని స్వామి కి వ్యతిరేకంగా ఒక వర్గం సిద్దమైంది. విజయ్ వైపు ఆ వర్గం ఎమ్మెల్యేలు చూస్తున్నారు. అసెంబ్లీలో విజయ్ బల పరీక్ష తరువాత.. ఈ ఎమ్మెల్యేలు తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
విజయ్ ప్రభుత్వం ఏర్పాటు వేళ అన్నా డీఎంకే లో చీలిక కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత అన్నా డీఎంకేలో ఒక వర్గం విజయ్ కు మద్దతు ఇచ్చేలా పళిని స్వామి పైన ఒత్తిడి తెస్తోంది. దీంతో.. ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఇప్పటి వరకు పుదుచ్చేరిలోని రిసార్ట్స్ లో ఉంచారు. ఈ రోజు వారిని చెన్నైకు తీసుకువచ్చారు. వారితో భేటీ కోసం పళిని స్వామి తన నివాసంలో కీలక భేటీ ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి విజయ్ కు మద్దతుగా నిలుస్తున్న వారిలో పలువురు డుమ్మా కొట్టారు. సీనియర్ నేత ఆర్వీ షణ్ముగం నాయకత్వంలో ఆ ఆరుగురు మరో చోట భేటీ అయ్యారు. వీరిలో విజయ్ కు కుడిభుజంగా వ్యవహరిస్తున్న ఆదవ్ అర్జున్ అత్త లీమా రోజ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం నెంబర్ గేమ్ లో సమస్యలు ఎదుర్కొంటున్న విజయ్ కు ఈ చీలక భవిష్యత్ లో మేలు చేసే అంశంగా భావిస్తున్నారు.

బల పరీక్ష వేళ కీలక పరిణామాలు
ఈ రోజు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. విజయ్ కు అయిదు పార్టీల మద్దతుతో 120 మంది ఎమ్మెల్యేలు బాసటగా నిలిచారు. ఈ నెల 13వ తేదీ లోగా అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 120 మందితో బల నిరూపణ సులభంగానే గట్టెక్కుతారు. అయితే, అసెంబ్లీ వేదికగా వీరు విజయ్ కు మద్దతు ప్రకటించే అవకాశం లేదు. బల పరీక్ష సమయంలో గైర్హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. ఆ తరువాత 20-25 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం నాయకత్వంలో టీవీకేకు అనుబంధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వీరి విషయంలో విజయ్ తో మధ్య వర్తులు రాయబారం నడుపుతున్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన విజయ్ వీరి విషయంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా భవిష్యత్ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications