రఘురామ విషయంలో జగన్ సూపర్ సక్సెస్..?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఆయనకు టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజు వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది.
టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం నుంచి బరిలో దిగాలని భావించిన రఘురామ రాజుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ సీటును బీజేపీ ఆశిస్తోంది. నరసాపురం సీటు దాదాపు బీజేపీకి ఖారారైనట్టే. దీంతో బీజేపీలో చేరి నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్న రఘురామకు అక్కడ కూడా నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది.

నరసాపురం టికెట్‌ను తనకి కేటాయించాలని బీజేపీ అధిష్టానం వద్ద రఘురామ చేసిన పైరవీలు విఫలం అయినట్టుగా సమాచారం అందుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకు టికెట్ ఇవ్వకూడదని బీజేపీలోని కొంతమంది నేతలు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. రఘురామను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే విషయంలో బీజేపీ అధిష్టానం పెద్దలు సైతం అంతగా ఆసక్తి చూపించడం లేదు.

తాజాగా ఈ వ్యవహారంపై రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తనకు ఎంపీ సీటు రాకుండా జగన్ తన కోవర్ట్‌ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. సీఎం జగన్ బీజేపీలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని నాకు టికెట్ దక్కకుండా అడ్డుకుంటున్నారని రఘురామ ఆరోపించారు. మరోవైపు బీజేపీ నరసాపురంలో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని భావిస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి బీజేపీ తరుపున ఎంపీగా దివంగత కృష్ణంరాజు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన భార్య శ్యామలా దేవిని పోటీలో దించాలని బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. దీంతో రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కే ఛాన్స్ కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications