పవన్ పంతం నెగ్గుతుందా?
Pawan Kalyan: ఇంకాస్సేపట్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభం కాబోతోంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు లెక్కింపు ఆరంభమౌతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈ మరాఠా గడ్డపై కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయంపై మధ్యాహ్నానికి ఓ స్పష్టత రానుంది.
వాస్తవ ఫలితాలు ఎలా..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా శివసేన (ఏక్‌నాథ్ షిండే)- భారతీయ జనతా పార్టీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటికి జైకొట్టాయి. వాస్తవ ఫలితాలు ఎలా ఉండబోతోన్నాయనేది నేడు తేలిపోతుంది.

మేజిక్ ఫిగర్‌పై
మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని ఎవరు అందుకుంటారు? 2019 తరహాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా? ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా మహాయుటి అధికారంలోకి వస్తుందా? అనే విషయం ఉత్కంఠత నెలకొంది.
మహాయుటి మళ్లీ?
మొన్నటి వరకు మహాయుటి ప్రభుత్వమే కొనసాగిందిక్కడ. 2019 నాటి ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్ఫాటు చేయడానికి అవసరమైన సంపూర్ణ మెజారిటీ రాలేదనే విషయం తెలిసిందే. ఫలితంగా ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పాయి. మహా వికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి.
అఘాడీలో చీలిక..
అఘాడీ ప్రభుత్వం ఎంతో కాలం పాటు కొనసాగలేకపోయింది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల దెబ్బకు కుప్పకూలింది. తొలుత శివసేన, ఆ తరువాత ఎన్సీపీలో చీలికను విజయవంతంగా తీసుకునిరాగలిగింది. చీలిక వర్గ నేతలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కమలం. ముఖ్యమంత్రిగా శివసేన చీలిక వర్గ నేత ఏక్‌నాథ్ షిండే కొనసాగారు.

పవన్‌పై అందరి దృష్టి..
ఈ బిగ్ ఫైట్ మధ్య జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అందరి దృష్టి నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో ఆయన మహాయుటి తరఫున ప్రచారం చేశారు. అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన రెండురోజుల పాటు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
పవన్ మాట చెల్లుతుందా?
పూణే కంటోన్మెంట్, బల్లార్‌పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్‌లల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో నివసించే నియోజవర్గాలవి. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో తెలుగు ప్రజల ఓటు బ్యాంక్ ఉంటోందక్కడ. వారిని ఆకట్టుకోవడానికి తమ కూటమి భాగస్వామి అయిన పవన్‌ను రంగంలో దింపింది ఎన్డీఏ.
ఓటు ఎటు..
పుణే కంటోన్మెంట్- రమేష్ ఆనంద్ రావ్ బగ్వే, బల్లార్‌పూర్- సుధీర్ ముంగంటివర్, షోలాపూర్- దేవేంద్ర ఖొటే, డెగ్లూర్- జితేష్ రావ్ సాహెబ్, లాతూర్- అర్చన చకుర్‌కర్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. వారి తరఫున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications