వైసీపీకి జగన్ ఆప్త మిత్రుడు గుడ్ బై..!!
వైసీపీని ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ కు పంపారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు కూడా రాజీనామా చేశారు. అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
వైసీపీకి బిగ్ షాక్ తగి లింది. మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు వైసీపీ నేత ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఆళ్ల నాని తొలి నుంచి జగన్ కు మద్దతు దారుడిగా ఉన్నారు. జగన్ కాంగ్రెస్ వీడి వైసీపీ ఏర్పాటు సమయం నుంచి జగన్ తోనే కొనసాగుతున్నారు. 2004, 2009లో ఏలూరు నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని తిరిగి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షించారు. కరోనా సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

తాజా ఎన్నికలకు ముందే ఆళ్ల నాని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారు. ఇదే విషయం జగన్ తోచర్చించారు. అయితే, ఈ ఎన్నికల వరకు పోటీ చేయాలని అప్పట్లోనే జగన్ సూచించారు. దీంతో, తాజా ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని టీడీపీ అభ్యర్ది బడేటి రాధాక్రిష్ణయ్య 62388 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత ఆళ్ల నాని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పార్టీ పదవులతో పాటుగా పార్టీకి రాజీనామా చేస్తూ జగన్ కు లేఖ రాసారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు లేఖలో స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications