వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతిలో సకల జనుల సమ్మె: వీధుల్లో రైతుల ర్యాలీ: నోటీసుల కలకలం..!

|
Google Oneindia TeluguNews

రాజధాని తరలింపు ప్రతిపాదన పైన అమరావతి రైతులు..స్థానికులు ఆందోళన తీవ్రతరం చేసారు. తెలంగాణ ఉద్యమ తరహాలో అమరావతి గ్రామాల్లో నేటి నుండి సకల జనుల సమ్మెకు దిగారు. జేఏసీ నేతల పిలుపు మేరకు గ్రామాల్లో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. టీస్టాల్స్, హోటల్స్‌ను మూసివేయించారు. అత్యవసరమైన పాలు, మందులు, ఆస్పత్రులకు సమ్మె నుంచి మినహాయించారు. దుకా ణాలు తెరిపించాలంటూ పోలీసులు ఒత్తిడి చేశారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక..వెలగపూడి..మల్కాపురం గ్రామాల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలం రేపుతున్నాయి.

వైసీపీ ఫ్యాన్‌కు మూడు రెక్కలు, రాజధాని మూడు ముక్కలు, టీడీపీ నేత యనమల రామకృష్ణుడువైసీపీ ఫ్యాన్‌కు మూడు రెక్కలు, రాజధాని మూడు ముక్కలు, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు

గ్రామాల్లో స్వచ్చంద సమ్మె..

గ్రామాల్లో స్వచ్చంద సమ్మె..

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. నేటి నుంచి గ్రామాల్లో సకల జనుల సమ్మెకు జేఏసీ నేతలు పిలుపునివ్వడంతో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. టీస్టాల్స్, హోటల్స్‌ను మూసివేయించారు. అత్యవసరమైన పాలు, మందులు, ఆస్పత్రులకు సమ్మె నుంచి మినహాయించారు. సకల జన సమ్మెలో భాగంగా మందడంలో రైతులు దుకాణాలు మూసివేయించాలని యత్నించారు. కాగా దుకాణాలు తెరిపించాలంటూ పోలీసులు ఒత్తిడి చేశారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. చివరకు పోలీసులకు రైతులు గులాబీ పూలు ఇచ్చి, నమస్కారం పెడుతూ నిరసన తెలిపారు. అలాగే పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలు తుడిచి, పూలు ఇచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.

ప్రభుత్వం ప్రకటించే వరకూ..

ప్రభుత్వం ప్రకటించే వరకూ..

రాజధాని తరలింపు అంటే తమ శావాల మీదుగా తీసుకెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. విశాఖ వాసులు జగన్‌ను రాజధాని కావాలని అడిగారా అని ప్రశ్నించారు. జగన్‌ను నమ్మి గెలిపిస్తే తమను నడి వీధిలో నిలబెట్టారని ఆక్రోశం వెల్లగక్కారు. ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని, అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. మందడం వీధుల్లో రైతులు ర్యాలీ నిర్వహించారు. రైతులు ప్రతీ ఇంటికి వెళ్లి గులాబీలు అందజేశారు. ఉద్యోగులు, పోలీసులకు గులాబీలు ఇచ్చి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. సచివాలయం వెళ్లే వైపు రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు.

నోటీసులతో కలకలం

నోటీసులతో కలకలం

వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో నోటీసులు కలకలం రేపుతున్నాయి. కేసులు ఉన్నందున పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ పలువురు రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు విచారణకు చిలకలూరి పేట రూరల్ పోలీస్‌స్టేషన్‌కు హాజరు కావాల్సిందిగా వెలగపూడి, మల్కాపురం గ్రామస్థులకు నోటీసులు పంపారు. దాదాపు 15మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి. ఇక, సచివాలయం వెళ్లే రోడ్డ వద్ద స్థానికులు ధర్నాకు దిగారు. వారిని అక్కడ నుండి ధర్నా విరమించాలని పోలీసులు కోరారు.

English summary
All people started strike in Amaravati villages against capital shifting proposal. shops and hotels closed in capital area. Police issued notices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X