ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!
ఏపీలో ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు జరుగుతోంది. ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు, రైతులు, మహిళలకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమయంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ చేసింది.
టెట్ పరీక్షపై నిర్ణయం: టెట్ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. డీఎస్సీకి ముందు టెట్ పరీక్షను నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. టెట్ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్దమైంది. దీంతో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు ప్రిపరేషన్ సన్నాహాలు మొదలుపెడుతున్నారు.

2022, 2023 సంవత్సరాల్లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా త్వరలో విడుదల చేయనున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 ఆగస్టులో చివరిసారిగా టెట్ నోటిఫికేషన్ జారీ చేసారు. నాడు టెట్‌కు దాదాపు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుకోగా.. పరీక్ష రాసిన వారిలో దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు.
నిబంధనల సడలింపు: ఈ సారి దాదాపు అయిదు లక్షల మంది టెట్ రాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్ధులు టెట్ పేపర్ 2ఏ రాసేందుకు గతంలో డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఉండేది. అయితే దాన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది.
ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్‌లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీంతో ఏపీ టెట్ 2024 ఎక్కువ మంది దరఖాస్తు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేయాలి. లేదంటే డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్ 1 పరీక్ష రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు.
కీలక నిర్ణయాల దిశగా: ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పాఠశాల విద్యాశాఖ ఐదు శాతం మార్కులు సడలింపు ఇచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్ 1 రాసే అభ్యర్థులకు గతంలో ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్/సీనియర్ సెకండరీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ఇక, ఎన్నికల సమయం సమీపించటంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతోంది. ఈ సారి జరిగే మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటుగా ఎన్నికల వరాల ప్రకటనకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications