Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నారా లోకేష్ కు ప్రమోషన్ - కొత్త టీం సిద్దం..!!

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. దీంతో, పాలనలో - పార్టీలో సమూల ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు జరుగుతోంది. ఇటు పార్టీ మహానాడు వేదికగా కీలక ప్రకటనలకు రంగం సిద్దమైంది. కొత్త టీంల రూపకల్పన పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ కు ప్రమోషన్ దాదాపు ఖాయమైంది. సీనియర్ల బాధ్యతలు మారనున్నాయి. దీంతో, మహానాడు వేదికగా చేసే నిర్ణయాల పైన పార్టీ - కూటమిలో ఉత్కంఠ పెరుగుతోంది.

మహానాడు వేదికగా
టీడీపీ - కూటమి ప్రభుత్వంలో కొత్త నిర్ణయాలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు జరగనుంది. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న వేడుక కావటంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయం లో పార్టీలో కీలక మార్పులకు రంగం సిద్దమైంది. కొంత కాలంగా లోకేష్ కు ప్రమోషన్ గురించి పార్టీ లో చర్చ జరుగుతోంది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేది పార్టీలోని కొందరు నేతల డిమాండ్. కాగా, ఈ డిమాండ్ తెర మీదకు వచ్చిన తరువాత పవన్ మద్దతు దారుల నుంచి అభ్యం తరాలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో, ఎవరూ ఈ అంశం పై మాట్లాడ వద్దని టీడీపీ ఆదేశించింది.

all-set-for-nara-lokesh-to-become-tdp-working-president-details-here

చంద్రబాబు నిర్ణయం
ఇక, ఇప్పుడు ఏడాది పాలన పూర్తవుతున్న వేళ మరో సారి లోకేష్ ప్రమోషన్ పైన చర్చ తిరిగి మొదలైంది. లోకేష్ కు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించాలని మహానాడు వేది క గా పార్టీ నేతలు డిమాండ్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా జరిగిన పాలిట్ బ్యూరో సమావేశం లొ లోకేష్ మండల స్థాయి నుంచి ఏ నేత వరుసగా మూడు సార్లు కంటే వరుసగా పదవుల్లో కొనసా గరాదని ప్రతిపాదన చేయగా, ఆమోదం లభించింది. ఇదే ఫార్ములా పార్టీ జాతీయ - రాష్ట్ర కమిటీ ల్లోనూ అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. లోకేష్ ను మంత్రిగా పరిమితం చేయకుం డా పార్టీ - ప్రభుత్వం రెండింటా కీలక పదవి ఉండాలనేది ఆయన మద్దతు దారుల డిమాండ్. కాగా, చంద్రబాబు సైతం భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా లోకేష్ కు అవకాశాలు కల్పించా లని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Take a Poll

కీలక పదవి
టీడీపీలో ప్రస్తుతం నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా లోకేష్ చేసిన ప్రతిపాదన తో ఇప్పుడు లోకేష్ ను ఆ పదవి కంటే మెరుగైన పదవి లేదా మార్పు చేయాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోకేష్ కు ప్రమోషన్ మాత్రమే దక్కే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. అందులో భాగంగా వర్కింగ్ ప్రెసిండెట్ పదవి లేదంటే కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వటం ఖాయమని పార్టీ వర్గాల సమాచారం. అదే విధంగా సుదీర్ఘ కాలంగా పార్టీ ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న సీనియర్ల కు స్థాన చలనం తప్పేలా లేదు. వారిలో కొందరి ని కొనసాగిస్తూ యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో, మహానాడు వేదికగా తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+