Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ యుద్దానికి "సిద్దం", కొత్త లెక్కలు - ఎన్నికల వేళ బిగ్ టర్న్..!!

ఏపీలో 2024 వార్ షురూ అయింది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. నేడు భీమిలి నియోజకవర్గం సంగివలసలో భారీ సభకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సభ ద్వారా సీఎం జగన్ కేడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికల వరాలను ప్రకటించే అవకాశం ఉంది. విపక్షాల ప్రచారాన్ని తిప్పి కొట్టనున్నారు. సభకు పెద్ద ఎత్తున జనం తరలి రానున్నారు. ర్యాంప్ వాక్ తో కార్యకర్తల మధ్యకు జగన్ వెళ్తూ ప్రసంగించేలా సర్వం సిద్దం చేసారు.

సీఎం జగన్ సిద్దం: ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ముందుగా పార్టీ కేడర్ తో మమేకం కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అయిదు భారీ సభలకు ప్లాన్ చేసారు. ఈ రోజు భీమిలో సముద్ర తీరాన జన హోరు కనిపించేలా పార్టీ ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

All set For YSRCP Siddham meeting at Bhimili today, CM Jagan may announce key decisions

ఈ సభలో కార్యకర్తలతోనూ మాట్లాడించనున్నారు. వారి అభిప్రాయాలను సభా వేదిక నుంచే సీఎం జగన్ తెలుసుకోనున్నారు. అక్కడే విపక్ష పార్టీల ఆరోపణలు..కుమ్మక్కు రాజకీయాలు..తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలను వివరిస్తూ..మరోసారి గెలిచేందుకు ఎలా వ్యవహరించాలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఎన్నికల సమరశంఖం: ఈ సభా వేదిక నుంచి ఈ 56 నెలల కాలంలో తన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం గురించి సీఎం జగన్ వివరించనున్నారు. జగన్ నిర్వహించే రీజనల్ కేడర్ సమావేశాలను సాధారణ సభలకంటే భిన్నంగా నిర్వహిస్తున్నారు. జగన్ ర్యాంప్ వాక్ చేయనున్నారు. సభకు లక్షలాది మంది తరలి వచ్చేలా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ప్లాన్ చేసారు.

జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పొత్తులతో ఎన్నిక ల బరిలోకి దిగుతున్నాయి. ఇక పూర్తిగా కేడర్ ను ఎన్నికలకు సిద్దం చేయటంతో పాటుగా ప్రతిపక్షాల పైన విమర్శలను తిప్పి కొడుతూ ప్రజలకు అర్దమయ్యేలా అన్ని విషయాలను సీఎం జగన్ ఈ సభ ద్వారా వివరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ఈ సభకు హాజరు కానున్నారు.

జగన్ దిశానిర్దేశం: ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. గెలుపే ప్రామాణికంగా, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్దులను ఫైనల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లాల్లో సభల్లో పాల్గొంటున్నారు. సీట్ల వ్యవహారంలో టీడీపీ - జనసేన మధ్య పలు నియోజకవర్గాల్లో విభేదాలు మొదలయ్యాయి.

పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల నేరుగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో ప్రజల మధ్యకు వస్తున్న ముఖ్యమంత్రి ఎన్నికలకు సమరశంఖం పూరిస్తూ పాల్గొనే తొలి సభలో చేసే రాజకీయ ప్రసంగం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సభ ఏపీ రాజకీయాల్లో బిగ్ టర్న్ అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+