ఆళ్ల నాని ఆకస్మిక మృతితో నేతల షాక్..! సంతాపాల వెల్లువ..!

ఏపీలో మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ( ఆళ్ల నాని) ఆకస్మిక మృతితో నేతలు షాకయ్యారు. నిన్న మొన్నటివరకూ తమతో కలిసి తిరిగిన నాయకుడు ఒక్కసారిగా హఠాన్మరణం పాలవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆళ్లనాని (Alla Nani) సొంత సామాజిక వర్గ నాయకులతో పాటు పలువురు రాష్ఠస్ధాయి నాయకులు, సీఎం, మాజీ సీఎం, మాజీ మంత్రులు ఆయన మరణంపై సంతాప తీర్మానాలు విడుదల చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారి (కాళీ కృష్ణ శ్రీనివాస్) హఠాన్మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 56 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో ఆయన దూరమవ్వడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు.

Alla Nani Sudden Demise Chandrababu YS Jagan and Other Leaders Express Deep Condolences

ఒకప్పటి తన కేబినెట్ సహచరుడు ఆళ్లనాని ఆకస్మిక మృతిపై మాజీ సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) మృతి తనను కలచివేసిందని జగన్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు

మరోవైపు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గారి మరణ వార్త విని తీవ్రంగా విచారిస్తున్నామని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి ఆయన చేసిన అంకితభావంతో కూడిన ప్రజా సేవ, చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+