సేమ్ సీన్ రీపీట్:అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత

అసెంబ్లీలోనే కాదు, మీడియా పాయింట్ వద్ద కూడ బుదవారం నాడు మరోసారి టిడిపి, వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేల మద్య వాగ్వాదం చోటుచేసుకొంది.మంగళవారం నాడు మహిళా ఎమ్మెల్యేల మద్య వాగ్వాదం చోటుచేసుకొంటే,

అమరావతి: అసెంబ్లీలోనే కాదు, మీడియా పాయింట్ వద్ద కూడ బుదవారం నాడు మరోసారి టిడిపి, వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేల మద్య వాగ్వాదం చోటుచేసుకొంది.మంగళవారం నాడు మహిళా ఎమ్మెల్యేల మద్య వాగ్వాదం చోటుచేసుకొంటే, బుదవారం నాడు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకొన్నాయి.

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద వైసిపి, టిడిపి సభ్యుల మధ్య రెండో రోజు కూడ వాగ్వాదాలు చోటుచేసుకొన్నాయి.

allegations between palle raghunath reddy and chevi reddy bhasker reddy

మంగళవారం నాడు టిడిపి మహిళ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతుండగా, వైసిపి మహిళ ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు ప్రయత్నించారు.దీంతో రెండు పార్టీల మహిళా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది.అయితే మార్షల్స్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

బుదవారం నాడు ఉదయం అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలపై వైసిపి సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసిపి సభ్యులు మీడియాతో మాట్లాడుతుండగా టిడిపి ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకొన్నారు. టిడిపి ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడ ఉన్నారు.

రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరే కారణమంటూ వైసిపి సభ్యులు మీడియా వద్ద ప్రస్తావించడాన్ని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తప్పుబట్టారు. దీంతో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి, వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది.

అసెంబ్లీలోనే కాదు, మీడియాపాయింట్ వద్ద కూడ తమ గొంతు నొక్కుతున్నారని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై విమర్శలు చేశారు.మీడియా పాయింట్ వద్దే మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు తమ వాదనలు విన్పించుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+