కీచక లెక్చరర్: క్లాస్‌లో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, సిసిటీవీల్లో అమ్మాయిల దుస్తులు చూసి..
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ కీచక లెక్చరర్ ఉదంతం వెలుగు చూసింది. అమ్మాయిల హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజీని చూసి, వారు ఏ దుస్తులు వేసుకున్నారో గమనించి, మరుసటి రోజు క్లాసులో వారి డ్రెస్సుల పైన కామెంట్ చేసేవాడు.

ఆ లెక్చరర్ పేరు శ్రీనివాస్. ఓ ఫార్మసీ కాలేజీలో అతను పని చేస్తున్నాడు. తరగతి గతిలోనే డబుల్ మీనింగ్ డైలాగులతో అమ్మాయిల పైన కామెంట్ చేసేవాడని చెబుతున్నారు. విద్యార్థులను బాగా వేధిస్తున్నాడని అంటున్నారు.
అమ్మాయిల హాస్టల్ గదిలో సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కూడా నిబందనలకు విరుద్ధంగా ఉన్నట్లు చెబపుతున్నారు. ఆ సీసీ టీవీలలో వారు వేసుకున్న డ్రెస్సులను లెక్చరర్ శ్రీనివాస్ చూసి, తమను కామెంట్ చేస్తున్నాడని పలువురు అమ్మాయిలు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications