చంద్రబాబుకు తొలి ఓటమి.. లెక్కలు మారుతున్నాయ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో పార్టీ శ్రేణులకు, ముఖ్య నేతలకు అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్:
రాష్ట్రంలో ఒక భయాన్ని సృష్టించి పాలన చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైయస్ జగన్ ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారని, ఇందుకోసం ప్రజలను భయపెట్టి, ప్రలోభపెట్టి తప్పుడు సాక్ష్యాలు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని, దుర్మార్గపు సంప్రదాయాలకు తెరలేపారని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం తప్ప మరేమీ ఉండదని హెచ్చరించారు.

అక్రమాలను కప్పిపుచ్చడానికే డైవర్షన్ పాలిటిక్స్:
ప్రభుత్వం అక్రమాలు, అవినీతిని ప్రజల నుంచి దారి మళ్లించడానికే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని జగన్ విమర్శించారు. ఎంపీ మిథున్‌రెడ్డిని అన్యాయంగా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు తన కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి ఎదిరించినందుకే కక్షగట్టి ఆ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. అసలు లిక్కర్ స్కామ్ ఎవరి హయాంలో జరిగిందని ప్రశ్నించిన ఆయన, తమ ప్రభుత్వం ప్రైవేటు దుకాణాలను తీసివేసి, అమ్మకాల వేళను తగ్గించి, టాక్స్‌ను పెంచి అమ్మకాలను తగ్గించామని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే స్కాంలు జరిగాయని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
లులూ గ్రూపునకు భూమి కట్టబెట్టడం, నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచుకోవడం వంటి ఘోరమైన దోపిడీని ఎప్పుడూ చూడలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వం మాదిరిగా చంద్రబాబు బటన్లు నొక్కకపోవడానికి కారణం బటన్ నొక్కితే నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్తుంది కాబట్టే, తనకు ఏమీ రాదని, అందుకే నేరుగా ఆదాయాలను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ప్రజా సంక్షేమానికి మంగళం:
తమ ప్రభుత్వంలో అమలైన పథకాలను కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని జగన్ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు వేలాది కోట్లు బకాయి పెట్టారని, లక్షలాది పెన్షన్లను తీసివేశారని, కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజల తరపున నిలదీయాలని సూచించారు.భూ పందారాలు, పనుల్లో యథేచ్ఛ దోపిడి జరుగుతోందని, అంచనాలు విపరీతంగా పెంచి దోచుకుంటున్నారని విమర్శించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తొలగించి దోపిడికి వీలు కల్పించారని ఆరోపించారు.
పార్టీ పునర్నిర్మాణం, పోరాట కార్యాచరణ:
వైయస్ఆర్‌సీపీ యుద్ధ వాతావరణంలో పుట్టిన పార్టీ అని, రాబోయే రోజుల్లో ప్రజల తరపున ప్రణాళికాబద్ధంగా పోరాటం చేస్తామని జగన్ ప్రకటించారు. పార్టీ పునర్నిర్మాణం వేగంగా జరుగుతోందని, జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయ్యిందని, త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, బూత్ లెవల్ కమిటీల నియామకం జరుగుతుందని, వచ్చే ఆరు నెలల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో బలోపేతం కావాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంగా ఉంటేనే ప్రయోజనకరమని గుర్తు చేశారు. పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండి, ప్రజల తరపున గొంతు విప్పాలని పిలుపునిచ్చారు.
కేసులకు భయపడేది లేదు:
చంద్రబాబు పెడుతున్న కేసులకు భయపడేది లేదని, తనను 16 నెలలు జైల్లో పెట్టినా ప్రజలు తమను ఆశీర్వదించారని, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు అంతగా స్పందిస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత, ప్రజలకు చేసిన మంచి తమను ముందుండి నడిపిస్తాయని తెలిపారు.
ఈ సమావేశంలో వక్ఫ్ చట్టంపై టీడీపీ ద్వంద్వ వైఖరి, రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల (ధాన్యం, పెసలు, మినుములు, మిర్చి, అరటి తదితరాలు), ఆక్వా ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గిపోవడంపై పీఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నష్టాలపై పార్టీ పోరాటానికి ప్రణాళిక సిద్ధం చేయాలని జగన్ సూచించారు. ప్రతి పీఏసీ సమావేశంలో ఎజెండాపై చర్చించి పార్టీకి సూచనలు చేయాలని, ఐక్యంగా ఉండి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, ఏ సమస్య వచ్చినా అది మనది అనుకుని పరిష్కారం కోసం ప్రయత్నించాలని పీఏసీ సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications