చంద్రబాబు దెబ్బకు జగన్, పెద్దిరెడ్డికి షాక్, ముగ్గురు పోటీ చేస్తే ఒక్క ఓటు పడింది

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో జగన్, పెద్దిరెడ్డి వర్గానికి ఊహించని షాక్ ఇచ్చారు. చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఇప్పటికే ఇక్కడి పాలకవర్గం టీడీపీ చేతిలో ఉండగా తాజాగా గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో టీడీపీ సభ్యులే విజయం సాధించారు. టీడీపీ తరపున ఐదుగురు, వైసీపీ తరపున ముగ్గురు సభ్యులు పోటీలో నిలిచారు.

టీడీపీ సభ్యులైన ఐదుగురికీ పూర్తి మెజారిటీ రావడంతో వారి గెలుపును ఎన్నికల అధికారి, కమిషనర్‌ అరుణ ప్రకటించారు. నిబంధనల ప్రకారం ఎన్నికల్ని నిర్వహించలేదని ఆరోపిస్తూ వైసీపీ కార్పొరేటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. చిత్తూరు నగరపాలక కమిషనర్‌ తీరుకు వ్యతిరేకంగా కార్యాలయం ఎదుట వైసీపీ కార్పోరేటర్లు నిరసన తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థలో ఐదుగురు సభ్యుల స్టాండింగ్‌ కమిటీకి ఎనిమిది మంది పోటీ చేయడంతో ఇటీవల పోలింగ్‌ నిర్వహించారు.

Alliance wins Chittoor Municipal Corporation Standing Committee elections

ఎన్నికల అధికారి, చిత్తూరు నగరపాలక కమిషనర్‌ అరుణ, పీవో, ఓపీవోలతో కలిసి కౌన్సిల్‌ హాలులో స్టాండింగ్‌ కమిటీకి సంబంధించి వివరాలను సభ్యులకు వివరించారు. ఐదుగురు సభ్యులున్న కమిటీకి ఎనిమిది మంది పోటీలో ఉన్నారని, సభ్యులంతా ఐదుగురికే ఓటు వేయాలని సూచించారు. కౌన్సిల్‌ హాలులో పోలింగ్‌ బూత్‌ ఉండటంతో సభ్యులంతా బయటికి వెళ్లి క్యూలైన్‌లో మేయర్‌ చాంబర్‌ వద్ద బ్యాలెట్‌ పత్రాలను తీసుకుని కౌన్సిల్‌ హాలులోకి వచ్చి ఓటు వేయాలని సూచించారు.

దీనిని వైసీపీ కార్పొరేటర్లు వ్యతిరేకించారు. కౌన్సిల్‌ హాలులోనే సభ్యుల పేర్లను పిలిస్తే బ్యాలెట్‌ పత్రాలను తీసుకుని సీక్రెట్‌గా ఏర్పాటు చేసిన తెర లోపల ఓటు వేస్తామని, అలా కాకుండా బయటి నుంచి రమ్మని చెప్పడం సరికాదని అభ్యంతరం తెలిపారు. దీంతో కమిషనర్‌కు, వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బయటి నుంచి క్యూలైన్‌లో వస్తేనే ఓటింగ్‌కు అనుమతిస్తామని కమిషనర్‌, పీవో చెప్పడంతో పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు డిప్యూటీ మేయర్‌ చంద్రశేఖర్‌, వైసీపీ కార్పొరేటర్లు చెప్పారు.

విషయం తెలుసుకున్న వైసీపీ చిత్తూరు సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ విజయానందరెడ్డి నగరపాలక కార్యాలయానికి చేరుకున్నారు. కార్పొరేటర్లతో కలిసి కమిషనర్‌ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నే టీడీపీ కార్పొరేటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్‌ సమయం ముగిసిన ఏజెంట్ల సమక్షంలో అనంతరం పీవో, ఏపీవోలు లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. టీడీపీ సభ్యులకు అవసరమైన పూర్తి మెజార్టీ దక్కింది.

Alliance wins Chittoor Municipal Corporation Standing Committee elections

నిర్మల, రాజే్‌షకుమార్‌రెడ్డి, శశికుమార్‌, సుష్మ, అశోకన్‌కు ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈ ఐదుగురిని స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికల అధికారి అరుణ ప్రకటించారు. వైసీపీ సభ్యులు చంద్రశేఖర్‌, మధుబాబు, శోభ పోటీ చేశారు. అయితే చంద్రశేఖర్‌కు మాత్రం ఒక్క ఓటు పడింది. కాగా, స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలో విజయం సాధించిన వారిని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ అభినందించారు. నగరాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళుతున్నామని, ఎన్నికల్లో మద్దతునిచ్చిన వారందరికి అభినందనలు తెలిపారు.

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల నిర్వహణ తీరు నచ్చక కమిషనర్‌ అరుణపై వైసీపీ కార్పొరేటర్లు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డితో కలిసి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో కమిషనర్‌ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆమె తీరు గురించి కలెక్టర్‌కు వివరంగా చెప్పామని, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ హరినారాయణన్‌కు కూడా మెయిల్‌ ద్వారా ఫిర్యాదు పంపామని చిత్తూరు వైసీపీ కార్పోరేటర్లు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+