''అల్లు అర్జున్'' పై డైలామాలో నిర్మాతలు!
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పుష్ప2 గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తే బాగుంటుంది అనే విషయంలో మైత్రీమూవీ మేకర్స్ నిర్మాతలతోపాటు దర్శకుడు సుకుమార్ మల్లగుల్లాలు పడుతున్నారు. పుష్ప మొదటి భాగం 2021 డిసెంబరులో విడుదలైంది. ఆ సమయంలో తెలుగులో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. కానీ నార్త్ లో హిట్ అవడంతో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈసారి అటువంటి పొరపాటు చేయకుండా తెలుగులో కూడా భారీగా వసూళ్లు రాబట్టాలనే యోచనలో నిర్మాత, దర్శకులున్నారు.

2021 డిసెంబరులో పుష్ప1 విడుదలవడంతోపాటు 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. తర్వాత సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను కూడా దృష్టిలో పెట్టుకొని చాలాచోట్ల థియేటర్ల నుంచి ఈ సినిమాను తప్పించేశారు. ఈసారి అటువంటి పొరపాటు జరగకూడదనే పట్టుదలతో నిర్మాత, దర్శకులున్నారు. వాస్తవానికి పుష్ప2 ను 2023 డిసెంబరులో విడుదల చేయాలని మొదట భావించారు. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేసినా కనీసం రెండు నెలలు స్టడీగా ఆడుతుందని, అటువంటప్పుడు డిసెంబరులో విడుదల చేస్తే కష్టమవుతుందంటున్నారు.

డిసెంబరులో విడుదల చేస్తే తెలుగులో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల కోసం దీన్ని తప్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాబోయే సంక్రాంతికి మంచి క్రేజ్ ఉండే సినిమాలే విడుదల కాబోతున్నాయి. సమ్మర్ లో విడుదల చేద్దామనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా వేసవిలోనే రాబోతోంది. వీటన్నింటికి తోడు బాలీవుడ్ లో కూడా సానుకూల సమయం ఉండాలి. హృతిక్ రోషన్ ఫైటర్ జనవరిలో విడుదలవనుండగా షారుఖ్ ఖాన్ డుంకీ మార్చిలోకానీ, ఏప్రిల్ లోకానీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏ సినిమాతోను తలపడకుండా కంటిన్యూగా థియేటర్లలో ఆడడంతోపాటు ఏ సినిమాలకు పోటీ లేకుండా చూసే యోచనలో నిర్మాత, దర్శకులున్నారు. ఆర్టిస్టుల కాంబినేషన్ తో డేట్లు దొరకడం కూడా సమస్యగా మారింది. పుష్ప2 షూటింగ్ ఇంకా చాలా తీయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications