మెగా వార్నింగ్: ఎట్టకేలకు లెంపలేసుకున్న నాగబాబు
Allu Arjun, Nagababu: ప్రముఖ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు ఎట్టకేలకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను శాంతింపజేసే ప్రయత్నాలకు దిగారు. లెంపలేసుకున్నారు. దిద్దుబాటు చర్యలకు దిగారు. తన తప్పును తెలుసుకున్నారు. దాన్ని సరిదిద్దుకున్నారు.
ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తన ఆప్త మిత్రుడి కోసం ఆయన తన భార్య స్నేహారెడ్డితో కలిసి అదే పనిగా ఆయన నంద్యాలకు వచ్చారు. ఈ ఎన్నికల్లో శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు.
ఒక వైపు- పిఠాపురం నుంచి స్వయానా తన మేనమామ పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ- ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు. అదే సమయంలో జనసేన ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు పలకడం- మెగా ఫ్యామిలీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
అల్లు అర్జున్ వైఖరిని తప్పు పట్టారు జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైన పరాయివాడేనని, తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ వాడేనంటూ పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించిన పోస్ట్ అది.
ఈ ట్వీట్ తరువాత నాగబాబుకు అసలు సినిమా చూపించారు అల్లు అర్జున్ అభిమానులు. కుప్పలు తెప్పలుగా రిప్లైలు పెట్టారు. ఘాటు పదజాలంతో రెచ్చిపోయారు. వందల సంఖ్యలో రిప్లైలు పడ్డాయి ఈ ట్వీట్‌కు. అల్లు అర్జున్ ఆర్మీ మాత్రమే కాకుండా అటు వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా నాగబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
దీనితో తన ఎక్స్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. రెండు రోజుల పాటు ఆయన ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో లేకుండా పోయారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మీద కూడా ఆయన కనిపించలేదు. దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టయింది ఆయన పరిస్థితి.
"I have deleted my tweet"
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024

అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబం సైతం ఈ ట్వీట్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనితో నాగబాబు మళ్లీ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌ను రీయాక్టివేట్ చేశారు. ఆ ట్వీట్‌ను డిలెట్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే దీన్ని పోస్ట్ చేశారాయన.












Click it and Unblock the Notifications