వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్ మనీపై మాట్లాడరేం, హెలికాప్టర్‌లో తేవాలా: పవన్ కళ్యాణ్‌పై అంబటి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించకపోవడం నిర్లక్ష్యమే కాకుండా బాధ్యతారాహిత్యమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. 'మీరు మామూలు సినిమా హీరోగా ఉంటే మిమ్మల్ని ఎవరూ అడగరు. మీకో పార్టీ ఉంది. అది టిడిపి మిత్రపక్షంగా ఉంది. పైగా ఎక్కడ అన్యా యం జరిగితే అక్కడ ఉంటానని మీరే చెప్పుకున్నారు' అని అన్నారు.

'కాబట్టి ప్రభుత్వ తప్పొప్పులపై మీరు స్పందించాలి. మేము కూడా మిమ్మల్ని రాజకీయ పార్టీ అధ్యక్షుడిగానే చూస్తున్నాం. కాబట్టి మీరు స్పందించకపోతే, మహిళా సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి లేదని నమ్మవలసి ఉంటుంద'ని అన్నారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై పవన్ మౌనం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కాల్‌మనీపై మీ అభిప్రాయమేమిటో చెప్పాలన్నారు.

Amabti questions Pawan Kalyan silence on Call money

'కాల్ మనీ వ్యవహారంతో టిడిపికి సంబంధం లేదంటారా? మీడియా ముందుకొచ్చి అదే చెప్పండి' అన్నారు. 'కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో చిక్కుకున్న మహిళా బాధితులను మీరు ఇంతవరకూ పరామర్శిం చలేదు. కనీసం ఖండించలేదు. అంటే దీన్ని బట్టి మీరు ఏమి చేసినా చంద్రబాబునాయుడు అనుమతి తీసుకునే చేస్తా రన్న అనుమానం ప్రజల్లో ఉంటుంది' అన్నారు.

బహుశా దీనికి కూడా ప్రత్యేక హెలికాప్టర్ కావాలేమో మరి తమకు తెలియదని అన్నారు. 'పోనీ దానికీ అవసరమైతే మంత్రి కామినేని ఉన్నారు. మొన్న ఆయనే మిమ్మల్ని బాబు దగ్గరకు తీసుకు వచ్చారు కదా? ఇప్పుడూ ఆయనే తీసుకువస్తారేమో అడిగితే పోయేది కదా' అని అన్నారు.

English summary
YSR Congress party leadr Ambati Rambabu questioned Jana Sena chief Pawan Kalyan's silence on Call money sex racket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X