Amalapuram Woman: అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు- అవాక్కయిన డాక్టర్లు..!
ఏపీలోని అమలాపురంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మహిళ కడుపు నొప్పితో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కడుపులో 570 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అసాధారణ పరిణామంతో కంగుతిన డాక్టర్లు చివరికి ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్న విధంగా సర్జరీ చేసి ఆమెను రక్షించారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
జిల్లాలోని దేవగుప్తం గ్రామానికి చెందిన జాలెం నరసవేణి అనే 31 సంవత్సరాల మహిళ కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాఢపడుతోంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు అమలాపురం లోని ఏఎస్ఏ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్లు గాల్‌స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఏకంగా 570 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

అనంతరం నరసవేణికి అత్యవసర సర్జరీ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. అరుదైన శస్త్రచికిత్స చేసి మహిళ కడుపులో ఉన్న 570 రాళ్లను డాక్టర్లు తొలగించారు. ముందు మహిళ కడుపులో 570 రాళ్లు చూసి షాక్ అయిన డాక్టర్లు.. ఇన్ని వందల సంఖ్యలో రాళ్లు ఉండటం చాలా అరుదు అంటున్నారు. సర్జరీ తర్వాత ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తేల్చారు. త్వరలో ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications